Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాలం కలిసి వచ్చింది.. గాజు ఉంగరంతో కోటీశ్వరి అయ్యింది.. ఎలా?

Webdunia
మంగళవారం, 12 ఫిబ్రవరి 2019 (11:53 IST)
కాలం కలసి వస్తే గాజు ఉంగరం కూడా కోటీశ్వరులను చేస్తుందనేందుకు నిదర్శనంగా ఓ ఘటన చోటు చేసుకుంది. లండన్‌కు చెందిన డెబ్రా గడ్డర్డ్ (55) 33 ఏళ్ల కిందట ఓ బూట్ బజార్‌లో (చిన్న సంత) గాజు ఉంగరాన్ని కొనుగోలు చేసింది. అప్పుడు దాని విలువ రూ.970 మాత్రమే. కొన్ని రోజులు ధరించిన తర్వాత దానిని ఓ పెట్టెలో పెట్టి భద్రపరిచింది. 
 
అయితే తన తల్లి ఇటీవల ఓ బంధువు చేతిలో మోసపోయి ఉన్నదంతా పోగొట్టుకొంది. జీవనం దుర్భర స్థితికి చేరుకుంది. ఈ తరుణంలో తల్లిని ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో గడ్డార్డ్ తన దగ్గరున్న నగలు అమ్మాలని నిర్ణయించుంది. అప్పటికే ఎన్నో ఆభరణాలను అమ్మేసింది. దాదాపు 15 సంవత్సరాల పాటు పెట్టెలో ఉంచిన గాజు ఉంగరాన్ని కూడా నగల దుకాణంలో అమ్మకానికి పెట్టింది. 
 
గాజు ఉంగరాన్ని పరిశీలించిన వ్యాపారి, అది మామూలు ఉంగరం కాదని 26.27 క్యారెట్ల వజ్రమని చెప్పడంతో డెబ్రా గడ్డార్డ్ ఆశ్చర్యపోయింది. 970 రూపాయలతో కొన్న ఉంగరంలో వజ్రాలు పొదిగి ఉన్నాయని చెప్పినా నమ్మలేకపోయింది. దానిని సోత్బీ సంస్థ దగ్గరికి తీసుకెళ్లి వేలానికి పెట్టారు. వేలం ఖర్చులు పోగా గడ్డార్డ్ చేతికి రూ.4.3 కోట్లు చేరాయి. 
 
ఆ మొత్తంతో తల్లికి ఆర్థిక సాయం చేయడంతో పాటు మరికొంత మొత్తాన్ని సేవా కార్యక్రమాలుకు వెచ్చిస్తానని తెలిపింది. మిగిలిన డబ్బును అమెరికా టూర్‌కి ఖర్చు చేయనున్నట్లు కూడా తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments