Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లేడీ శంకర్ దాదా ఆదాయం ఎంతో తె లుసా...

Advertiesment
lady shankar dada
, గురువారం, 31 జనవరి 2019 (16:18 IST)
శంకర్ దాదా సినిమాలో చిరంజీవి ఎవరినైనా కౌగిలించుకుంటే వారి లోపల ఉండే బాధ ఇట్టే తీసివేసినట్లు పోతుందనే సిద్ధాంతాన్ని చెప్తూంటాడు... దానికి ఉదాహరణలుగా ఒకరిద్దరిని చూపిస్తాడు కూడా... ఈవిడ... మరి శంకర్ దాదా చూసిందో లేదో తెలియదు గానీ... సరిగ్గా అలాంటి పనినే ఉద్యోగంగా చేసేస్తోంది.
 
అమెరికాలోని కన్సార్‌కు చెందిన రాబిన్ స్టినె కౌగిలించుకోడాన్నే ఉపాధి మార్గంగా ఎంచుకొంది. అబ్బాయిలు, అమ్మాయిలనే తేడా లేకుండా ఎవరైనా సరే ఆమెను హత్తుకుని హాయిగా నిద్రపోవచ్చు. కేవలం కౌగిలింతలే కాదు, ఆమె తన శరీరమంతటినీ కస్టమర్లకు అప్పగిస్తానని రాబిన్ స్టినె తెలిపింది. చేతుల్లో చేతులు పెట్టవచ్చని, తన శరీరాన్ని నిమరుతూ రిలాక్స్ కావచ్చని పేర్కొంది. తాను కూడా వారి శరీరాన్ని సున్నితంగా నిమురుతూ వారి ఒత్తిడి దూరం చేసేందుకు సహకరిస్తానని తెలిపింది. ఇది కేవలం థెరపీ మాత్రమేనని, సెక్స్‌కు ఆస్కారమే లేదని పేర్కొంది. 
 
‘‘మనం ఎవరినైనా అప్యాయంగా కౌగిలించుకున్నప్పుడు.. వారి శరీరం రిలాక్స్ అయి సంతోషాన్ని కలిగించే ఆక్సిటోసిన్ విడుదలవుతుంది. ఈ ‘బాండింగ్ హార్మోన్’ ప్రభావం వల్ల వారికి ఏర్పడిన ఒత్తిడి కూడా దూరమవుతుంది. చాలామంది తమకు ఏం కావాలని నోరు తెరిచి అడగలేరు. నేను ఎంచుకున్న ఈ వృత్తి అలాంటివారికి చేయూతని ఇస్తుంది. నేను కూడా ఒకప్పుడు అలాంటి పరిస్థితే ఎదుర్కొనే దాన్ని. ఆ బాధ నుంచే ఈ ఐడియా పుట్టింది’’ అని రాబిన్ తెలిపింది. 
 
అయితే, ఆమె కౌగిళ్లలో సేద తీరడం ఉచిత సేవేమీ కాదండోయ్.. గంటకు రూ.5630 చెల్లించాలి. ఇలా ఆమె ఏడాదికి రూ.28 లక్షలు వరకు సంపాదిస్తోంది. బాగుంది కదా, ఈ ఐడియా! కానీ, ఇలాంటి ఉద్యోగాలు అమెరికాలాంటి దేశాల్లోనే సాధ్యం!

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

న్యూడ్ రెస్టారెంట్ మూసివేత... ఎందుకంటే...?