Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూఎస్ ఎన్నికల్లో అనూహ్య పరిణామం: రంగంలోకి దిగిన కిమ్ కర్దాషియన్ భర్త!

Webdunia
ఆదివారం, 5 జులై 2020 (11:00 IST)
వచ్చే నవంబరు నెలలో అమెరికా అధ్యక్ష పీఠానికి ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ మరోమారు అధ్యక్ష పీఠానికి తలపడుతున్నారు. అలాగే, డెమొక్రాట్ల తరపున జో బిడెన్ రంగంలోకి దిగుతున్నారు. దీంతో వీరిద్దరి మధ్య గట్టి పోటీ ఉంటుందని ప్రతి ఒక్కరూ భావిస్తూ వచ్చారు. అయితే, ఇపుడు అనూహ్య పరిణామం ఒకటి సంభవించింది. ప్రముఖ ర్యాపర్ కిమ్ కర్దాషియన్ భర్త కెన్యే వెస్ట్ రంగంలోగి దిగారు. గతంలో ఈయన రిపబ్లికన్ పార్టీ తరపున బరిలోకి దిగిన డోనాల్డ్ ట్రంప్‌కు మద్దతు ప్రకటించారు. కానీ ఇపుడు ఏకంగా డోనాల్డ్ ట్రంప్‌కు ప్రత్యర్థిగా రంగంలోకి దిగుతున్నారు. 
 
ఇదేసమయంలో టెస్లా అధినేత ఎలాన్ ముస్క్ ఆయనకు మద్దతు పలకడంతో, దేశవ్యాప్తంగా ఇదే చర్చనీయాంశమైంది. తాను మాజీ ఉపాధ్యక్షుడు, ప్రస్తుతం డెమోక్రాట్ల తరపున పోటీ చేస్తున్న జో బిడెన్‌తో పోటీ పడతానని ఆయన ప్రకటించారు. అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసే అభ్యర్థులకు కావాల్సిన కనీస మద్దతుదారుల కోసం పోలింగ్ ఇప్పటికీ చాలా రాష్ట్రాల్లో కొనసాగుతూనే ఉన్న నేపథ్యంలో, తనకూ అవకాశాలు ఉన్నాయని ఆయన అంటున్నారు.
 
'నేను అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నా. దేవుడిపై నమ్మకం ఉంచే అమెరికన్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సి వుంది. మన భవిష్యత్తును మనమే నిర్ణయించుకోవాలి' అని తన సోషల్ మీడియా ఖాతాలో కెన్యే వెస్ట్ వ్యాఖ్యానించారు. కాగా, ఈ విషయంలో కెన్యే ఎంత సీరియస్‍గా ఉన్నారన్న చర్చ ఇప్పుడు మొదలైంది. నవంబర్ 3న ఎన్నికలు జరుగున్నాయన్న సంగతి తెలిసిందే. గతంలో తన భార్య కిమ్‌తో కలిసి కెన్యే వెస్ట్ వైట్ హౌస్‌ను కూడా సందర్శించారు 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments