Webdunia - Bharat's app for daily news and videos

Install App

గర్భంతో విద్యాలయాలకు రావడానికి వీల్లేదట... అధ్యక్షుడి ఆదేశం

ప్రపంచంలో ఉన్న అత్యంత పేద దేశాల్లో ఒకటి టాంజానియా దేశం. ఈ దేశంలో పేదరికంతో పాటు ఉపాధి అవకాశాలు అంతంతమాత్రమే. దీంతో ఆ దేశ మహిళలు చదువుకుని ఏదో ఒక ఉపాధి పొందేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు. అయితే, ఆ దే

Webdunia
సోమవారం, 26 జూన్ 2017 (14:46 IST)
ప్రపంచంలో ఉన్న అత్యంత పేద దేశాల్లో ఒకటి టాంజానియా దేశం. ఈ దేశంలో పేదరికంతో పాటు ఉపాధి అవకాశాలు అంతంతమాత్రమే. దీంతో ఆ దేశ మహిళలు చదువుకుని ఏదో ఒక ఉపాధి పొందేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు. అయితే, ఆ దేశ అధ్యక్షుడు జాన్ మగుఫులలీ ఇటీవల జారీ చేసిన ఆదేశం వారికి శాపంలా మారింది. 
 
గర్భం ధరించిన విద్యార్థులను పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలకు రానివ్వద్దని ఆదేశిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో అక్కడి మహిళాలోకమంతా అధ్యక్షునిపై తిరుగుబాటును ప్రకటించింది. చివరికి దీనిపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం కూడా దాఖలైంది. అధ్యక్షుడు మగుపులీ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని ఆఫ్రికాకు చెందిన ఒక మహిళా సంఘం డిమాండ్ చేసింది. 
 
దీనికితోడు చిన్న వయసులోనే వివాహం జరిగి, గర్భం ధరించి విద్యాలయాలకు వస్తున్నవారు అధ్యక్షుని నిర్ణయంతో ఆవేదనకు లోనయ్యారు. తమ భవిష్యత్ ఏమవుతుందోనని బెంగపెట్టుకుంటున్నారు. అన్ని దేశాల్లోనూ మహిళలు ముందంజ వేస్తుంటే ఇక్కడ అందుకు భిన్నంగా ఉందని వారు వాపోతున్నారు. ఈ ఆందోళనల నేపథ్యంలో అధ్యక్షుడు తిరిగి ఏం నిర్ణయం తీసుకుంటారో వేచిచూద్దాం.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments