Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇది ప్రజలందరి విజయం : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్

Webdunia
బుధవారం, 20 జనవరి 2021 (23:00 IST)
అమెరికాలో కొత్త చరిత్ర ప్రారంభమైందని దేశ 46వ అధ్యక్షుడుగా ప్రమాణం స్వీకారం చేసిన జో బైడెన్ వ్యాఖ్యానించారు. జో బైడెన్‌తో యూఎస్ సుప్రీంకోర్టు సీజే జస్టిస్‌ జాన్‌ రాబర్ట్స్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్ ప్రమాణ స్వీకారం చేశారు. తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా కమలా హారీస్ ప్రమాణం చేసి చరిత్ర సృష్టించారు.
 
బైడెన్ ప్రమాణ స్వీకారం తర్వాత దేశాధ్యక్ష హోదాలో ప్రసంగించారు. అమెరికాలో కొత్త చరిత్ర ప్రారంభమైందని అన్నారు. ఇది అమెరికా ప్రజలందరి విజయమన్న బైడెన్.. క్యాపిటల్ హింసతో ప్రజాస్వామ్యానికి ప్రమాదం వచ్చిందని భయపడ్డారన్నారు. 
 
మన దేశంలో ప్రజాస్వామ్యం బలంగా ఉందని, ఎలాంటి వివక్షకు స్థానం లేదని, యుద్ధంకన్నా శాంతిని కోరుకుంటున్నామన్నారు. నాలుగేళ్లలో అమెరికా ప్రజలు అరాచకాన్ని చూశారన్నారు. హింస, ఉగ్రవాదం సమస్యల్ని ఎదుర్కోవాలంటే ఇందుకు మీ అందరి సహకారం కావాలని, ఈ విషయంలో ప్రతి ఒక్క అమెరికా పౌరుడితో కలిసి పనిచేస్తామని బైడెన్ చెప్పుకొచ్చారు.
 
ఇకపోతే, ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదని, వైరస్‌ను తరిమికొట్టడమే తమ ప్రభుత్వ లక్షమని బైడెన్ అన్నారు. కరోనాతో ఆర్థిక రంగం కుదేలైందని, సవాళ్లను ఐకమత్యంగా ఎదురుకుందామని ఆయన దేశ పౌరులకు పిలుపునిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

రమణారెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించిన పద్మశ్రీ, డాక్టర్ బ్రహ్మానందం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments