Webdunia - Bharat's app for daily news and videos

Install App

జో బైడెన్ బృందంలో మరో భారతీయురాలికి చోటు

Webdunia
మంగళవారం, 29 డిశెంబరు 2020 (19:55 IST)
అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ అధకార బృందంలో మరో భారతీయురాలికి చోటు దక్కిది. కశ్మీర్ లో పుట్టి అమెరికాలోని లూసియానాలో పెరిగిన ఐషా షా అనే యువతికి ‘సీనియర్’ పోస్టును బైడెన్ అప్పగించారు. శ్వేతసౌధం డిజిటల్ వ్యూహ విభాగంలో రాబ్ ఫ్లాహెర్తీని ఎంపిక చేశారు.
 
ఆమెతో పాటు డిజిటల్ స్ట్రాటజీ విభాగంలో మరికొందరినీ బైడెన్ నియమించారు. డిప్యూటీ డైరెక్టర్లుగా రెబెక్కా రింకెవిచ్, క్రిస్టియన్ టామ్, డిజిటల్ ఎంగేజ్ మెంట్ డైరెక్టర్ గా కామెరాన్ ట్రింబుల్, ప్లాట్ ఫాం మేనేజర్ గా బ్రెండన్ కోహెన్, డిజిటల్ పార్ట్ నర్ షిప్ మేనేజర్ గా మహా ఘాండౌర్, వీడియో డైరెక్టర్ గా జొనాథన్ హెబర్ట్, ప్లాట్ ఫాం డైరెక్టర్ గా జేమీ లోపెజ్, క్రియేటివ్ డైరెక్టర్ గా కెరానా మ్యాగ్ వుడ్, డిజైనర్ గా యాబీ పిట్జర్, ట్రావెలింగ్ కంటెంట్ డైరెక్టర్ గా ఒలీవియా రైజ్నర్ లను నియమించారు.
 
బృందంలో వైవిధ్యమైన నిపుణులున్నారని, వాళ్లకు డిజిటల్ వ్యూహాల్లో ఎనలేని అనుభవం ఉందని బైడెన్ చెప్పారు. కొత్తగా, సృజనాత్మక పద్ధతుల్లో అమెరికా ప్రజలకు శ్వేత సౌధాన్ని వారు మరింత దగ్గర చేస్తారని చెప్పారు. ఇంత మంచి టీంతో పనిచేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments