Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారతీయులకు వరం... గ్రీన్ కార్డులకు వార్షిక కాల పరిమితులు

Webdunia
శనివారం, 20 ఫిబ్రవరి 2021 (15:11 IST)
లక్షలాది భారతీయులకు వరం కానున్న ఓ బిల్లును అమెరికాలో డెమొక్రాట్లు సభలో ప్రవేశపెట్టారు. కాంప్రెహెన్సివ్ ఇమ్మిగ్రేషన్ రిఫామ్ బిల్లు పేరిట దీన్ని సెనెటర్ బాబ్ మెనెండెజ్, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ మెంబర్ లిండా శాంచెజ్ ప్రతిపాదించారు.
 
గ్రీన్ కార్డులకు సంబంధించి వీటిపై గల వార్షిక కాల పరిమితులను తొలగించడానికి ఈ బిల్లు వీలు కల్పిస్తోంది. దీంతో ముఖ్యంగా ఇండియా నుంచి మరింత మందిని దేశంలోకి అనుమతించవచ్చు. ఇక తమ పేరెంట్స్ ఇమ్మిగ్రేషన్కు క్వాలిఫై కావడానికి 21 ఏళ్ళ ముందు ఎవరైనా ఇక్కడ చేరిన పక్షంలో గ్రీన్ కార్డు పొందడానికి వారు అనర్హులనే నిబంధన విషయంలో కూడా ఈ బిల్లు ‘సరళీకృత’ విధానాన్ని అనుసరిస్తోంది. ఈ అనర్హతను ఇక తొలగించనున్నారు.
 
అంటే ఇలాంటి హెచ్-1బీ వీసా గలవారి పిల్లలకు ఇది అనుకూలంగా ఉంది. వారు హెచ్-1బీ వీసాలతో ఈ దేశంలో కొనసాగవచ్చు. ప్రస్తుత నిబంధనల ప్రకారమైతే.. తమ తలిదండ్రులు ఇంకా గ్రీన్ కార్డులకోసం వేచి ఉన్న పక్షంలో..అలాంటి వారి పిల్లలకు ఈ దేశంలో ఉండే హక్కు లేదు. కానీ ఈ బిల్లు దాన్ని పూర్తిగా మార్చివేస్తోంది. 
 
ఇక- హెచ్-1 బీ వీసాల గల భార్య లేదా భర్త కూడా అమెరికాలో జాబ్ చేయవచ్చు. ఇమ్మిగ్రెంట్ల బంధువులు కూడా యూఎస్ లోని తమ కుటుంబాలను కలుసుకోవడానికి ఈ బిల్లు వీలు కల్పిస్తోంది. ఇమ్మిగ్రేషన్ పై అధ్యక్షుడు జోబైడెన్ ఇఛ్చిన ఎన్నికల హామీని నెరవేర్చేందుకు ఇది పూర్తిగా ఉద్దేశించినది.
 
చట్టవిరుద్ధంగా అమెరికాలో ప్రవేశించిన సుమారు ఎనిమిదిన్నర లక్షలమంది పిల్లలకు ఇక ఇమ్మిగ్రేషన్ హోదా లభించనుంది. వారిని డ్రీమర్స్ గా పేర్కొంటూ ఓ ప్రత్యేక కేటగిరిని ఇందులో చేర్చారు. ఈ బిల్లు ఆమోదం పొందితే ఇండియా నుంచి దాదాపు 5 లక్షల మంది ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్లకు ప్రయోజనం కలుగుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

జేమ్స్ కామెరూన్ అవతార్: ఫైర్ అండ్ యాష్ తెలుగు ట్రైలర్ ఇప్పుడు విడుదల

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments