Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఐపీఎల్ వేలం.. రూ.20లక్షలకు అర్జున్ టెండూల్కర్‌.. సారా హ్యాపీ!

ఐపీఎల్ వేలం.. రూ.20లక్షలకు అర్జున్ టెండూల్కర్‌.. సారా హ్యాపీ!
, శుక్రవారం, 19 ఫిబ్రవరి 2021 (20:10 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) మినీ వేలంలో ముంబై ఇండియన్స్‌ అర్జున్‌ టెండూల్కర్‌ను అతని కనీస ధర రూ.20 లక్షలకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. వేలంలో అర్జున్‌ను ముంబై దక్కించుకోవడంతో అతడి సోదరి సారా టెండూల్కర్ ఆనందంలో మునిగిపోయారు. ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో అర్జున్‌ టెండూల్కర్ బౌలింగ్‌ చేస్తున్న ఫొటోను పంచుకొని సారా టెండూల్కర్ సంతోషం వ్యక్తం చేశారు.
 
"నువ్వు సాధించిన ఈ ఘనతను.. నీ నుంచి ఎవరూ తీసుకోలేరు. ఇది నీది. క్రికెట్‌ అనేది తన రక్తంలోనే ఉంది. ఇన్నాళ్లూ నెట్స్‌లో సాధన చేసి మేటి క్రికెటర్‌గా ఎదిగాడు. ఇప్పుడిక 22 గజాలపై తుఫాన్‌ సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాడు'" అని సారా తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
 
అయితే కేవలం సచిన్ కొడుకనే ముంబై అర్జున్‌ను జట్టులోకి తీసుకుందని, క్రికెట్‌లో నెపోటిజం ఎక్కువైపోయిందని చాలా మంది విమర్శించారు. అర్జున్‌ను ముంబై తీసుకుంటుందని ముందే ఊహించామని, అసలు అతనికి ఏం అర్హత ఉందని వేలంలో కొనుగోలు చేశారని చాలా మంది నెటిజన్లు ట్రోల్ చేశారు.
 
అర్జున్‌ను తీసుకోవడంపై ముంబై టీమ్‌ యజమాని ఆకాశ్‌ అంబానీ సైతం ఓ వీడియోలో స్పష్టతినిచ్చే ప్రయత్నం చేశాడు. "అర్జున్‌ నైపుణ్యాల గురించి మా కోచింగ్ సిబ్బంది మహేల జయవర్ధనె, జహీర్ ఖాన్‌ ముందే చెప్పారు. సచిన్‌ తనయుడు ఎడమ చేతి వాటం ఫాస్ట్‌బౌలర్‌, బ్యాట్స్‌మన్‌ అని వివరించారు. ప్రపంచ క్రికెట్‌లో ఇలా ఎక్కువ మంది లేరని చెప్పారు. ఇతర యువ ఆటగాళ్లలాగే అర్జున్‌ కూడా ఈ స్థాయికి చేరుకున్నాడని చెప్పాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోహ్లీ డిప్రెషన్‌కు గురయ్యాడట.. ఆ సమయంలో ఒంటరిగా ఫీలయ్యాడట!