Webdunia - Bharat's app for daily news and videos

Install App

50 ఏళ్ల వయస్సులో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన జానెట్ జాక్సన్

ప్రముఖ గాయని జానెట్ జాక్సన్ 50 ఏళ్ల వయస్సులో తొలి సంతానానికి తల్లి అయ్యారు. ఏడుసార్లు గ్రామీ అవార్డు గెలుచుకున్న ఈమెకు పండంటి బాబు పుట్టాడు. తల్లీబిడ్డా ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని కుటుంబ సభ్యులు వెల్లడ

Webdunia
బుధవారం, 4 జనవరి 2017 (15:53 IST)
ప్రముఖ గాయని జానెట్ జాక్సన్ 50 ఏళ్ల వయస్సులో తొలి సంతానానికి తల్లి అయ్యారు. ఏడుసార్లు గ్రామీ అవార్డు గెలుచుకున్న ఈమెకు పండంటి బాబు పుట్టాడు. తల్లీబిడ్డా ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. 2012లో ఖతార్‌కు చెందిన వ్యాపారవేత్త విసాం అల్ మనాను పెళ్లాడిన ఈ ముద్దుగుమ్మ.. గత ఏప్రిల్‌లో 'అన్‌బ్రేకబుల్‌' టూర్‌ను హఠాత్తుగా రద్దు చేసుకున్న జానెట్‌ ఇటీవల లండన్‌లో పిల్లలకు కావలసిన సామగ్రి కొంటూ కన్పించారు. 
 
తాను కుటుంబంపై దృష్టిపెట్టాలనుకుంటున్నానని ఫ్యాన్స్‌కు ఇచ్చిన వీడియో సందేశంలో చెప్పుకొచ్చారు. 45 ఏళ్లు దాటాక పిల్లల్ని కనే హాలీవుడ్ ప్రముఖుల్లో జానెట్ కూడా చేరిపోయింది. కాగా.. ఆస్కార్‌ అవార్డు గ్రహీత హాలెబెర్రీ 47 ఏళ్ల వయసులో రెండో బిడ్డకు తల్లయ్యారు. జాన్‌ ట్రవోల్టా భార్య కెల్లీ ప్రెస్టన్‌ 48 ఏళ్ల వయసులో మూడో బిడ్డకు జన్మనిచ్చారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒక అద్భుతమైన సినిమా చూశా.. ఎవరూ మిస్ కావొద్దు : ఎస్ఎస్ రాజమౌళి

హీరో విశాల్‌కు పెళ్లి కుదిరింది.. వధువు ఎవరంటే?

ఈ బర్త్ డే నుంచి నాకు కొత్త జన్మ మొదలు కాబోతోంది : మంచు మనోజ్

హీరో మహేశ్ బాబు కుటుంబంలో కరోనా వైరస్!!

జూనియర్ వెరీ ఎమోషన్ టచ్చింగ్ స్టొరీ : దేవిశ్రీ ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments