పాకిస్థాన్ బుద్ధి మారలేదు.. చుక్కలు చూపించిన భారత్

Webdunia
శనివారం, 14 నవంబరు 2020 (09:14 IST)
పాకిస్థాన్ తన బుద్ధిని మార్చుకోలేదు. గతేడాది ఆగస్ట్ నుంచి పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కాల్పులు జరుపుతూనే ఉంది. తాజాగా మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని తుంగలో తొక్కి నియంత్రణ రేఖ వెంబడి కాల్పులకు తెగబడింది. తుపాకీ తూటాలు, మోర్టాన్‌లతో కాల్పులకు తెగబడింది. సైనికులతో స్థావరాలతో పాటుగా సామాన్య ప్రజలను లక్ష్యంగా చేసుకొని కాల్పులు జరిపింది. పాక్ కాల్పుల్లో ఐదుగురు జవాన్లు అమరులయ్యారు. ఆరుగురు పౌరులు మరణించారు.
 
కొన్ని ఇల్లు ధ్వంసం అయ్యాయి. గురేజ్ నుంచి ఉరి సెక్టార్ వరకు ఉన్న అనేక ప్రాంతాల్లో పాక్ సైన్యం కాల్పులు జరిపింది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులను ఇండియాలోకి జొప్పించేందుకు పాక్ ప్రయత్నం చేసింది. అయితే, పాక్‌కు బుద్ధిచెప్పేందుకు ఇండియా సైన్యం ఎదురుదాడికి దిగింది. 
 
రాకెట్ల వర్షం కురిపించింది. ఇండియా ఎదురుదాడిలో పాక్ లోని అనేక సైనిక బంకర్లు, లాంచింగ్ ప్యాడ్లు, చమురు నిల్వలు ధ్వంసం అయ్యాయి. 11 మంది పాక్ సైనికులు హతం అయ్యారు. అనేక మంది పాక్ సైనికులు అక్కడి నుంచి పారిపోయారు. దీనికి సంబంధించిన వీడియోను శుక్రవారం భారత ఆర్మీ విడుదల చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments