Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోడ్లు బాగోలేవా- మోదీతో మాట్లాడుతా: వాట్సాప్‌లో ఇవాంకా

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, వైట్ హౌస్ సలహాదారు ఇవాంకా ట్రంప్ హైదరాబాద్‌ పర్యటనపైనే తెలుగు రాష్ట్రాల్లో భారీ చర్చ సాగుతోంది. దేశవ్యాప్తంగానూ ఇవాంకా టూర్‌పై ప్రజలు మాట్లాడుకుంటున్నారు.

Webdunia
సోమవారం, 27 నవంబరు 2017 (13:29 IST)
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, వైట్ హౌస్ సలహాదారు ఇవాంకా ట్రంప్ హైదరాబాద్‌ పర్యటనపైనే తెలుగు రాష్ట్రాల్లో భారీ చర్చ సాగుతోంది. దేశవ్యాప్తంగానూ ఇవాంకా టూర్‌పై ప్రజలు మాట్లాడుకుంటున్నారు. కేంద్ర నిఘా వర్గాలు ఇవాంకా పర్యటన నేపథ్యంలో అప్రమత్తంగా వుండాలని హెచ్చరికలు జారీ చేసినే నేపథ్యంలో ఇవాంకాకు అమెరికా అధ్యక్షుడికి కల్పించేంత స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. 
 
గ్లోబల్ సమ్మిట్‌కు వచ్చే ప్రతినిధులు ప్రయాణించే ఔటర్‌పై భద్రతకు 30 కిలోమీటర్ల మేర గస్తీ నిర్వహిస్తున్నారు. ఇందుకోసం 28 వాహనాలను ఉపయోగిస్తున్నారు. ఒక్కో వాహనంలో ఆయుధాలు, సాంకేతిక పరికరాలతో నలుగురు సిబ్బంది సిద్ధంగా ఉంటారని తెలుస్తోంది. ఇక ఇవాంకా రాకను  పురస్కరించుకుని ఆమె పర్యటించే ప్రాంతాల్లో తెలంగాణ సర్కారు ప్రత్యేక అలంకరణలు చేసింది. ఇంకా ఆమె ప్రయాణించే మార్గాలను కూడా సుందరంగా తీర్చిదిద్దింది. ఈ నేపథ్యంలో ఇవాంక పర్యటించే ప్రాంతాలను బాగు చేస్తున్న తెలంగాణ సర్కారుపై సెటైర్లు పేలుతున్నాయి. 
 
అంతేగాకుండా సోషల్ మీడియా వేదికగా ఇవాంకాను తెలంగాణ ప్రజలు, సెలెబ్రిటీలు తాము నివసించే ప్రాంతం గుండా ప్రయాణించాల్సిందిగా కోరుతున్నారు. ఈ లిస్టులో గాయని సునీత కూడా వున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో రోడ్ల దుస్థితి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంక వరకూ వెళ్లింది. హైదరాబాదులో రహదారుల పరిస్థితి బాగోలేదని.. కేవలం ట్రంప్ కుమార్తె అయిన మీరు రావడంతోనే రోడ్లను అందంగా మారుస్తున్నాయని ఆమెకు ఫిర్యాదులు అందినట్లు సమాచారం. 
 
ఈ ఫిర్యాదులకు ఇవాంకా సైతం స్పందించినట్లు తెలుస్తోంది. ఇవాంక వాట్సాప్‌కు హైదరాబాదీలు రోడ్ల పరిస్థితిపై మెసేజ్‌లు పెడుతున్నారు. ఈ క్రమంలో మణికొండ వ్యక్తి పెట్టిన వాట్సాప్ మెసేజ్‌కు ఇవాంకా రెస్పాన్స్ ఇచ్చారని.. రోడ్ల నిర్మాణంపై తాను భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో మాట్లాడుతానని హామీ ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఆర్ రెహ్మాన్ ప్రపంచంలోనే అత్యుత్తమైన వ్యక్తి : సైరా బాను

'పుష్ప-2' మేకర్స్ నిర్ణయంపై దేవిశ్రీ ప్రసాద్ అసహనం.. !! (Video)

ట్రెండింగ్‌లో కిస్సిక్ - డిసెంబరు 5న "పుష్ప-2" రిలీజ్

వాస్తవ సంఘటనలకు అద్దం పట్టే మిస్టర్ మాణిక్యం గా సముద్రఖని

సింగర్ మంగ్లీకి ఉస్తాద్‌ బిస్మిల్లా ఖాన్‌ పురస్కారం ప్రదానం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments