Webdunia - Bharat's app for daily news and videos

Install App

టర్కీలో కొత్త సంవత్సర వేడుకల్లో పెను విషాదం.. 35మంది మృతి..

టర్కీలో జరిగిన కొత్త సంవత్సర వేడుకల్లో పెను విషాదం జరిగింది. ఇస్తాంబుల్‌లోని నైట్ క్లబ్‌లో ఓ గుర్తు తెలియని దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో 35 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 40 మంది పరిస్థితి

Webdunia
ఆదివారం, 1 జనవరి 2017 (09:19 IST)
టర్కీలో జరిగిన కొత్త సంవత్సర వేడుకల్లో పెను విషాదం జరిగింది. ఇస్తాంబుల్‌లోని నైట్ క్లబ్‌లో ఓ గుర్తు తెలియని దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో 35 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 40 మంది పరిస్థితి విషమంగా ఉంది. గత ఏడాది అమెరికాలోని ఓర్లాండోలో ఇదే తరహాలో ఓ నైట్‌క్లబ్‌లో దుండగుడు కాల్పులు జరిగిన ఘటనలో దాదాపు 50 మంది మృత్యువాత పడగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డ విషయం తెలిసిందే.
 
శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆర్టకోయ్‌లోని నైట్‌క్లబ్‌లో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఇస్తాంబుల్ గవర్నర్ ఇచ్చిన సమాచారం ప్రకారం.. న్యూ ఇయర్ వేడుకులు జరుగుతుండగా నైట్ క్లబ్‌లో ఈ విషాద ఘటన జరిగింది. కాల్పులు జరిగిన సమయంలో దాదాపు 500 మంది నైట్ క్లబ్‌లో వేడుకల్లో పాల్గొన్నారు. సాయుధుడు నైట్‌క్లబ్‌లో కాల్పులు జరపక ముందు ఓ పోలీసు అధికారి, ఓ పౌరుడిపై కాల్పులకు తెగబడ్డాడు. 
 
అనంతరం నైట్‌క్లబ్‌లో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని గవర్నర్ వివరించారు. శాంతాక్లాజ్ దుస్తుల్లో ఉన్నందున ఎవరికీ వారిపై అనుమానం రాలేదన్నారు. కాల్పులు జరుగుతుండగా ప్రాణ రక్షణ కోసం నైట్ క్లబ్ నుంచి బయటకు పరుగులు తీశారు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments