Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిరియాలో అమెరికా దాడి.. ఐసిస్ అగ్రనేత అబూబకర్ బాగ్దాదీ హతం?

Webdunia
ఆదివారం, 27 అక్టోబరు 2019 (12:49 IST)
సిరియాలో ఉగ్ర సంస్థ ఐసిస్ లక్ష్యంగా చేసుకుని అమెరికా దాడి జరిపింది. ఈదాడిలో ఐసీసీ అగ్రనేత అబూ బకర్ బాగ్దాదీతో పాటు.. మొత్తం 9 మంది ఐసిస్ నేతలు హతమైనట్టు వార్తలు వస్తున్నాయి. 
 
ఈ నేపథ్యంలో సిరియా దాడిపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఓ ట్వీట్ చేశారు. సిరియాలో 'భారీ సంఘటన జరిగింది' అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ట్వీట్ చేయడంతో ఈ విషయం చర్చనీయాశమైంది. 
 
ఐసిస్ స్థావరాలపై అమెరికా చేసిన దాడిపై బిట్రన్ కు చెందిన ఓ మానవ హక్కుల సంస్థ పలు వివరాలు తెలిపింది. సిరియా వాయవ్య ప్రాంతంలోని ఇడ్లిబ్ ప్రావిన్స్లో ఉన్న బారిషా గ్రామంలో హెలికాప్టర్ నుంచి సైనికులు జరిపిన కాల్పుల్లో తొమ్మిది మంది మృతి చెందారని పేర్కొంది. 
 
ఆ ప్రాంతంలో ఇస్లామిక్ స్టేట్‌కు చెందిన ఉగ్రవాదులు ఉంటారని వివరించింది. బారిషా శివారు ప్రాంతంలో ఉన్న ఓ ఇల్లు, కారుపై సైనికులు ఈ దాడి చేశారని పేర్కొంది. 
 
అయితే, అమెరికా చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్‌లో ఇదే ప్రాంతంలో ఐసిస్ అగ్రనేత అబూ బకర్ అల్ బాగ్దాదీని అమెరికా సైన్యం హతమార్చిందని కథనాలు వస్తున్నాయి. దీనిపై అమెరికా అధికారిక ప్రకటన చేయలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మదరాసి నుంచి శివకార్తికేయన్ లవ్ ఫెయిల్యూర్ యాంథమ్

మిత్ర మండలి నుంచి రెండవ గీతం స్వేచ్ఛ స్టాండు విడుదల

భగవత్ కేసరి , 12th ఫెయిల్ ఉత్తమ చిత్రం; షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే ఉత్తమ నటుడి అవార్డు

జాతీయ చలన చిత్ర అవార్డులు - ఉత్తమ చిత్రంగా 'భగవంత్ కేసరి'

Satyadev: మత్స్యకారుల బతుకుపోరాటంగా అరేబియా కడలి ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments