Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రాజీనామా చేయబోతున్నారా?

Webdunia
బుధవారం, 30 మార్చి 2022 (19:32 IST)
పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ తన పదవికి రాజీనామా చేయబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. అవిశ్వాస తీర్మానానికి ముందు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జాతిని ఉద్దేశించి చేయాలనుకున్న ప్రసంగాన్ని రద్దు చేసుకున్నారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ అధిపతి మిస్టర్ ఖాన్‌ను కలిసిన తర్వాత ఆయన తన ప్రసంగాన్ని రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది.

 
ఈ వారాంతంలో పార్లమెంటరీ అవిశ్వాసం ఓటింగ్‌కు ముందు కీలకమైన సంకీర్ణ భాగస్వామి తన అభిప్రాయాన్ని మార్చుకున్న నేపధ్యంలో ఖాన్ భవిష్యత్తు మరింత సందేహాస్పదంలో పడిపోయింది. రాజకీయ నాయకుడిగా మారిన క్రికెటర్‌ ఇమ్రాన్ స్థితి గందరగోళంలో పడిపోయింది.

 
పాకిస్తాన్ దేశంలో ఏ ప్రధానమంత్రి కూడా పూర్తిగా తమ పదవీకాలం పూర్తిచేయలేకపోవడం గమనార్హం. ఇమ్రాన్ ఖాన్ 2018లో ఎన్నికైనప్పటి నుండి తన పాలనలో అతిపెద్ద సవాళ్లను ఎదుర్కొంటున్నారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ రేపు ప్రారంభం కానుంది.

సంబంధిత వార్తలు

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments