Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉక్రెయిన్ విమానాన్ని కూల్చింది మేమే : నిజం అంగీకరించిన ఇరాన్

Webdunia
శనివారం, 11 జనవరి 2020 (10:24 IST)
ఇటీవల ఇరాన్ రాజదాని టెహ్రాన్ సమీపంలో ఉక్రెయిన్ దేశానికి చెందిన బోయింగ్ విమానం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఏకంగా 176 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఈ విమానం టెహ్రాన్ ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. సాంకేతిక లోపం వల్ల కూలిపోయివుండొచ్చని భావించారు. 
 
నిజానికి ఇరాన్ - అమెరికా దేశాల మధ్య దాడులు, ప్రతిదాడులు జరుగుతున్నాయి. దీంతో ఈ విమాన ప్రమాదంపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరిగింది. అయితే, ఈ విమానం కూలిపోవడానికి గల వీడియోలు విడుదలయ్యారు. ఇరాన్ సైన్యం భూతల మార్గం నుంచి ప్రయోగించిన క్షిపణుల కారణంగా ఈ విమానం కూలిపోయినట్టు తేలింది. 
 
ఈ నిజాన్ని ఇరాన్ అంగీకరించింది. విమానాన్ని తామే కూల్చేశామంటూ ఇరాన్ ఎట్టకేలకు ఒప్పుకుంది. ఇరాన్ విదేశాంగ మంత్రి జవద్ జరీఫ్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ, ఉద్దేశపూర్వకంగా ఈ చర్యకు పాల్పడలేదని తెలిపారు. కేవలం మానవ తప్పిదంగానే దీన్ని పరిగణించాలని కోరారు. అమెరికా దుందుడుకు చర్యలే ఈ ఘటనకు దారి తీశాయని ఆరోపించారు. మృతుల కుటుంబసభ్యులకు, తమ పౌరులను కోల్పోయిన దేశాలకు క్షమాపణలు చెబుతున్నామని అన్నారు.
 
విమానం కూలిపోయిన తర్వాత... ఇరానే ఈ చర్యకు పాల్పడిందనే ఆరోపణలు వచ్చాయి. అయితే, ఈ ఆరోపణలను ఇరాన్ ఖండించింది. కానీ, ఇరానే విమానాన్ని కూల్చిందంటూ అమెరికా, కెనడా ఇంటెలిజెన్స్ విభాగాలు వీడియోల రూపంలో వెల్లడించాయి. దీనికితోడు, విమానాన్ని ఓ అగ్నిగోళం వంటి వస్తువు తాకిన ఓ వీడియో కూడా బహిర్గతమైంది. ఈ నేపథ్యంతో, చివరకు ఇరాన్ నిజాన్ని అంగీకరించకతప్పలేదు. 

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments