Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంజూకు పిల్లల బెంగ... భారత్‌కు తిరిగి వచ్చేందుకు సిద్ధం....

Webdunia
సోమవారం, 30 అక్టోబరు 2023 (12:32 IST)
పాకిస్థాన్‌కు చెందిన ఫేస్‌బుక్ ఫ్రెండ్ కోసం దేశం విడిచి వెళ్లిపోయిన భారత వివాహిత అంజు తిరిగి భారత్‌కు రానుంది. తన ఇద్దరు పిల్లలపై బెంగతో ఆమె మానసికంగా కుంగిపోయినట్టు ఆమె పాకిస్థాన్ భర్త వెల్లడించాడు. దీంతో కుమార్తె, కుమారుడిని చూసేందుకు రాజస్థాన్‌కు రానుందని, ఇందుకోసం పాకిస్థాన్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. 
 
ఇందుకోసం పాకిస్థాన్ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారని, పాక్ ప్రభుత్వం అనుమతి రాగానే ఆమె రాజస్థాన్‌కు వస్తారని ఆమె పాక్ భర్త నస్రుల్లా తెలిపారు. పిల్లలపై బెంగతో గత నెలలో అంజు మానసికంగా కుంగిపోయిందని తెలిపారు. పిల్లలను చూసేందుకు రాజస్థాన్ వెళ్లాలని తను నిర్ణయించుకుందని, కూతురు కొడుకును చూసి తిరిగి పాకిస్థాన్ వస్తుందని నస్రుల్లా చెప్పారు.
 
రాజస్థాన్‌కు చెందిన అంజుకు 34 యేళ్లు. భర్తతో పాటు 15 యేళ్ల కుమార్తె, ఆరేళ్ల కొడుకు ఉన్నారు. అయితే, ఫేస్‌బుక్‌లోని పరిచయమైన పాకిస్థాన్ ప్రియుడు నస్రుల్లా (29)ను ప్రేమించి అతడి కోసం ఆగస్టు నెలలో వాఘా సరిహద్దులు దాటి పాకిస్థాన్‌లో అడుగుపెట్టారు. ఆపై మతం మార్చుకుని ఫాతిమాగా మారి నస్రుల్లాను వివాహం చేసుకుంది. 
 
ఆ తర్వాత ఇకపై తన ఇల్లు పాకిస్థాన్ అని పేర్కొంది. పాక్ ప్రభుత్వం ఆమె వీసాను యేడాది పాటు పొడగించింది. ఈ క్రమంలో అంజు కొన్ని రోజులుగా పిల్లల కోసం బెంగు పెట్టుకుందని నస్రుల్లా చెప్పారు. పిల్లలను చూసేందుకు భారత్‌కు వెళ్ళి వస్తానని చెప్పడంతో ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నామని వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డ్రగ్స్ - సైబర్ నేరాల అరికట్టేందుకు ప్రయత్నం : నిర్మాత దిల్ రాజు

ఆయన సినిమాలో పార్ట్ కావడం నా కల : హీరోయిన్ మాల్వి మల్హోత్రా

శ్రీకృష్ణుడి గొప్పతనం అంశాలతో తెరకెక్కిన ‘అరి’ విడుదలకు సిద్ధం

గీతా ఆర్ట్స్ లోకి ఎంట్రీ ఇస్తున్న సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ నిహారిక ఎన్ఎం

విశ్వంభర డబ్బింగ్ పనులు ప్రారంభించారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

తర్వాతి కథనం
Show comments