Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్నానం చేస్తుండగా ప్రసవం.. బాత్రూమ్ వెంటిలేటర్ నుంచి విసిరేసిన మహిళ... ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 16 అక్టోబరు 2020 (18:53 IST)
ఓ యువతి నిండు గర్భిణి. స్నానం చేసేందుకు బాత్రూమ్‌కు వెళ్లింది. టాప్ తిప్పుకుని స్నానం చేయడం ప్రారంభించింది. ఇంతలో ఓ బిడ్డను ప్రసవించింది. అయితే, ఆ పసికందును బాత్రూమ్ వెంటిలేటర్ నుంచి బయటకు విసిరేసింది. ఆ తర్వాత బాత్రూమ్‌ను శుభ్రం చేసి.. ఏమి జరగనట్టుగా పడక గదికి వెళ్లింది. ఈ షాకింగ్ ఘటన అమెరికాలోని న్యూయార్క్ నగరంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన వివరాలను పరిశీలిస్తే, న్యూయార్క్‌లోని క్వీన్స్ ఏరియాలో భార‌త సంత‌తికి చెందిన అమెరికా 23 యేళ్ళ యువ‌తి స‌బితా దూక్ర‌మ్‌‌. ఈమెకు వివాహమై భ‌ర్త‌తో క‌లిసి నివ‌సిస్తోంది. గ‌ర్భ‌వ‌తి అయిన ఆమె ఈ నెల 10న స్నానం చేస్తుండ‌గా బాత్రూంలో ప్ర‌స‌వించింది. వెంట‌నే బాలుడిని వెంటిలేట‌ర్‌లో నుంచి బ‌య‌ట‌ప‌డేసి బాత్రూంను శుభ్రంగా క‌డిగి, బెడ్‌రూంలోకి వెళ్లి నిద్ర‌పోయింది. 
 
అయితే బాలుడి ఏడుపు విని ఇరుగుపొరుగువారు ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. బాలుడి మెద‌డుకు బాగా గాయాల‌య్యాయ‌ని, మెదడులో వాపు ఉంద‌ని వైద్యులు తెలిపారు. మ‌రికొన్ని గంట‌లు గ‌డిస్తేగానీ ఏమీ చెప్ప‌లేమ‌ని వెల్ల‌డించారు. కాగా, ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 
 
ప్ర‌స‌వించిన విష‌యాన్ని కుటుంబ‌స‌భ్యులు ఎవ‌రికీ చెప్ప‌కుండా ఎందుకు దాచావ‌న్నపోలీసుల ప్ర‌శ్న‌కు స‌బితా దూక్ర‌మ్‌.. 'నేను బాత్రూం వెళ్లి స్నానం చేస్తుండ‌గా బాబు పుట్టాడు. అప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. నాకు చాలా భ‌యం వేసింది. బాత్రూంలో ఉన్న క‌త్తెర‌తో బొడ్డుతాడు క‌ట్‌చేసి బాబును బ‌య‌టికి విసిరేశా. ఆ త‌ర్వాత నా దుస్తుల‌ను బాత్రూంలోని లాండ్రీలో ప‌డేసి, బాత్రూంను శుభ్రంగా క‌డిగి బ‌య‌టికి వ‌చ్చి బెడ్రూంలో ప‌డుకున్నా' అని సింపుల్‌గా చెప్పింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అలియా భట్ వెబ్ సిరీస్ లో అడల్ట్ కంటెంట్ సినిమా చేస్తుందా?

మెగాస్టార్ చిరంజీవి పై సెస్సెషనల్ కామెంట్ చేసిన అనిల్ రావిపూడి

NTR: ఎన్టీఆర్, నాగార్జునల భిన్నమైన పాత్రలకు తొలి అడుగులు సక్సెస్ సాధిస్తాయా?

చిత్రపురి కార్మిలకు మోసం చేసిన వల్లభనేని అనిల్‌ కు మంత్రులు, అధికారులు అండ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments