Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

5G ఆధారిత యాపిల్ ఐఫోన్లు - ప్రారంభ ధర రూ.69,900 మాత్రమే...

Advertiesment
5G ఆధారిత యాపిల్ ఐఫోన్లు - ప్రారంభ ధర రూ.69,900 మాత్రమే...
, బుధవారం, 14 అక్టోబరు 2020 (12:53 IST)
అమెరికాకు చెందిన బహుళ టెక్నాలజీ సంస్థ యాపిల్ సరికొత్త ఫోన్‌ను విడుదల చేసింది. యాపిల్ ఐఫోన్ 12 సిరీస్‌లో నాలుగు 5జీ ఆధారిత ఫోన్లను మంగళవారం విడుదల చేసింది. 
 
ఇందులో ఐఫోన్ 12, ఐఫోన్ 12 మినీ, ఐఫోన్ 12 ప్రొ, ఐఫోన్ 12 ప్రొ మ్యాక్స్ ఉన్నాయి. భారత్‌లోని వినియోగదారులకు ఈ నెల 30 నుంచి ఇవి అందుబాటులోకి రానున్నాయి. వీటితోపాటు రూ.9,900 ధరతో హోం ఐప్యాడ్‌ను కూడా యాపిల్ ప్రకటించింది.
 
ఐఫోన్ 12, ఐఫోన్ 12 మినీ 64 జీబీ, 128 జీబీ, 256 జీబీ వేరియంట్స్‌లలో, బ్లూ, గ్రీన్, బ్లాక్, వైట్, ప్రొడక్ట్ (రెడ్) రంగుల్లో అందుబాటులో ఉన్నాయి.  వీటి ప్రారంభ ధర వరుసగా రూ.79,900, రూ.69,900గా పేర్కొంది. 
 
ఐఫోన్ 12 ప్రొ, ఐఫోన్ 12 ప్రొ మ్యాక్స్‌లు 128 జీబీ, 256 జీబీ, 512 జీబీ అంతర్గత మెమొరీతో గ్రాఫైట్, సిల్వర్, గోల్డ్, పసిఫిక్ బ్లూ రంగుల్లో అందుబాటులో లభ్యమవుతాయి. వీటి ప్రారంభ ధర వరుసగా రూ.1,19,900, రూ.1,29,900గా నిర్ణయించింది. 
 
 
ఐఫోన్ 12 సిరీస్ ఫోన్లు చూడగానే ఆకట్టుకునేలా ఉన్నాయి. వీటి డిజైన్ నాజూకుగా ఉండడంతో తేలిగ్గా, ఆకర్షణీయంగా ఉన్నాయి. వీటిలో
 
ఈ యాపిల్ ఐఫోన్ 12 సిరిసీ ఫోన్లు చూడముచ్చటగా ఉన్నాయి. వీటికిఏ14 బయానిక్‌ చిప్‌ను అమర్చారు. ఐఫోన్ మినీలో 5.4 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లే ఉపయోగించగా, ఐఫోన్ 12లో 6.1 అంగుళాల డిస్‌ప్లే అమర్చారు.
 
ప్రొ మోడల్‌ ఫోన్లలో 6.1 అంగుళాల స్క్రీన్, ప్రొ మ్యాక్స్‌లో 6.7 అంగుళాల రెటీనా డిస్‌ప్లే ఉంది. 12 ప్రొలో 12 ఎంపీ అల్ట్రావైడ్, 12 వైడ్ యాంగిల్ లెన్స్ 12 టెలిఫొటో లెన్స్ అమర్చారు. 
 
ఈ రెండు ఫోన్లు డీప్ ఫ్యూజన్ కెమెరా ఫీచర్‌తో వస్తున్నాయి. ఐఫోన్ 12 ప్రొలో మరింత అధునాతన కెమెరాలు ఉపయోగించారు. ఐఫోన్ 12 ప్రొ ఫోన్‌తో డాల్బీ విజన్ హెచ్‌డీఆర్ వీడియోలను రికార్డు చేసుకోవచ్చు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మరో మూడు రోజులు బయటకు రావొద్దు.... 2 రోజులు సెలవులు