Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రిటన్ షాడో మంత్రివర్గంలో విదేశాంగ మంత్రి భారత సంతతి మహిళ

ఠాగూర్
బుధవారం, 6 నవంబరు 2024 (10:17 IST)
బ్రిటన్ ప్రతిపక్ష కన్సర్వేటివ్ పార్టీకి కొత్త నాయకురాలిగా ఎన్నికైన కెమీ బాడెనాక్ తన షాడో మంత్రివర్గంలో విదేశాంగ మంత్రిగా భారత సంతతికి చెందిన ప్రీతి పటేల్ (52)ను మంగళవారం నియమించారు. పటేల్ పూర్వీకులు గుజరాతీలు. రిషి సునాక్ ప్రభుత్వంలో హోం మంత్రిగా పని చేసిన ప్రీతి, మహిళా వ్యవహారాల మంత్రిగా బాడెనాక్ బాధ్యతలు నిర్వహించారు. షాడో విదేశాంగ మంత్రి హోదాలో ప్రీతి పార్లమెంటు దిగువ సభ హౌస్ ఆఫ్ కామన్స్‌లో లేబర్ ప్రభుత్వ విదేశాంగ మంత్రి డేవిడ్ లామిని ఎదుర్కొంటారు. 
 
కన్సర్వేటివ్ పార్టీ పార్లమెంటు ఎన్నికల్లో ఓడిన తర్వాత పార్టీ అధ్యక్షత కోసం, పార్లమెంటులో ప్రతిపక్ష నాయకత్వ పాత్ర కోసం కెమీ బాడెనాక్‌తో పోటీపడినవారిలో ప్రీతి పటేల్ కూడా ఉన్నారు. బరిలో నిలిచిన మరి ఇద్దరు ప్రత్యర్థులు - రాబర్ట్ జెన్రిక్, మెల్ స్లైడ్లను బాడెనాక్ తన షాడో మంత్రివర్గంలో న్యాయ, ఆర్థిక మంత్రులుగా నియమించి తమ పార్టీలో ఐక్యతను చాటుకున్నారు.
 
షాడో మంత్రులు అసలు సిసలు మంత్రుల విధానాల్లోని లొసుగులను ఎండగట్టి ప్రత్యామ్నాయ విధానాలను ప్రతిపాదిస్తారు. ఇంధన, సమానతా వ్యవహారాలకు షాడో మంత్రిగా గోవా సంతతికి చెందిన క్లైర్ కాటిన్హో నియమితులయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sundeep Kishan: శివ మల్లాల నిర్మాణంలో సందీప్‌కిషన్‌ క్లాప్‌తో ప్రారంభమైన హ్రీం

బాణామతి బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న చిత్రం చేతబడి

Samantha: సమంత, రాజ్ కలిసి డిన్నర్ చేశారా? కారులో జతగా కనిపించారుగా! (video)

వార్ 2 లో హృతిక్ రోషన్, కియారా అద్వానీ లిప్ కిస్ ల రొమాంటిక్ సాంగ్

Kingdom Review: కింగ్ డమ్ తో విజయ్ దేవరకొండ కు సక్సెసా ! కాదా ! - కింగ్ డమ్ రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

తర్వాతి కథనం
Show comments