Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇంట్లో చోరీ చేయడానికి వచ్చి.. ఇంటిని శుభ్రం చేసిన వింత దొంగ!

Rice cooked Water

ఠాగూర్

, ఆదివారం, 6 అక్టోబరు 2024 (19:34 IST)
ఒంటరిగా ఉన్న మహిళ ఇంట్లో చోరీ చేయడానికి వచ్చిన ఓ దొంగ... ఇంటిని శుభ్రం చేసి వెళ్ళాడు. ఇంటిని నీట్‌గా సర్దేశాడు. ఇంట్లో వాళ్ల కోసం భోజనం కూడా సిద్ధం చేసి వెళ్లాడు. వెళుతూ వెళుతూ 'డోంట్ వర్రీ.. బీ హ్యాపీ' అంటూ ఓ పేపరుపై రాసిపెట్టి వెళ్లాడు. అయితే, ఇది చూసి ఆ ఇంటి యజమాని సంతోషించక పోగా తీవ్ర భయాందోళనకు గురైంది. ఒంటరిగా ఉండలేక స్నేహితురాలి దగ్గర ఉండిపోయింది. దొంగ దొరికేంత వరకూ ఇంటి వైపు వెళ్లనని భీష్మించి కూర్చొంది. ఈ ఘటన బ్రిటన్‍‌లోని మాన్ మౌత్ షైర్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
డేమియన్ వాజినిలోవిత్జ్ ఓ దొంగ.. గతంలో కూడా పలు నేరాలు చేసి జైలుకు వెళ్లి వచ్చాడు. ఇటీవల మాన్ మౌత్ షైర్‌లో ఓ ఇంట్లో దొంగతనం చేయడానికి వెళ్లాడు. ఆ ఇంట్లో ఓ మహిళ ఒంటరిగా నివసిస్తోందని తెలిసి బట్టలు ఉతకడంతో పాటు ఇంటి పనంతా చేశాడు. కిచెన్, ఫ్రిజ్ అన్నీ సర్దేశాడు. ఆపై ఫ్లోర్ తుడిచి నీట్‌గా చేశాడు. ఆఫీసు నుంచి అలసిపోయి వస్తుందనే ఆలోచనతో ఇంటి యజమాని కోసం భోజనం కూడా సిద్ధం చేసి పెట్టాడు. ఇంట్లో ఉన్న రెడ్ వైన్‌ను తాగి, ఆ సీసా, గ్లాసును మాత్రం టేబుల్‌పై అలాగే వదిలేశాడు. 
 
ఆపై ఇంటి యజమానిని ఉద్దేశించి దేనికీ చింతించకుండా తిని తాగి సంతోషంగా గడుపు అంటూ ఓ లెటర్ రాసి పెట్టి వెళ్లిపోయాడు. ఇంట్లోకి అడుగుపెట్టిన యజమానురాలు ఇదంతా చూసి భయాందోళనతో పోలీసులకు ఫోన్ చేసింది. ఆ తర్వాత ఒంటరిగా ఇంట్లో ఉండడానికి భయపడి స్నేహితురాలితో కలిసి ఉంటూ వచ్చింది. తాను ఒంటరిగా ఉంటున్న విషయం తెలుసుకున్న ఆ దొంగ ఏ క్షణంలో వచ్చి ఏం చేస్తాడోననే భయపడ్డానని చెప్పింది. రెండు వారాల తర్వాత దొంగ దొరికాడని పోలీసులు ఫోన్ చేయడంతో ఆందోళన తగ్గిందని తెలిపింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రూ.3 లక్షల అప్పు చెల్లించడంలో వివాదం.. బాలిక హత్య కేసులో వీడిన మిస్టరీ!