Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐర్లాండ్‌లో భారతీయుడిపై జాత్యహంకార దాడి...

ఠాగూర్
గురువారం, 31 జులై 2025 (15:49 IST)
ఐర్లాండ్ దేశంలో భారతీయుడుపై జాత్యహంకార దాడి జరిగింది. డబ్లిన్‌లో భారత్‌కు చెందిన ఓ వ్యక్తిపై అక్కడి కొందరు యుకులు దాడికి పాల్పడ్డారు. సంతోశ్ యాదవ్ అనే వ్యక్తి లెట్టర్‌కెన్ని సిటీలో ఉన్న విసార్ ల్యాబ్ అండ్ టెక్నాలజీ కంపెనీలో సీనియర్ డేటా అనలిస్టుగా పని చేస్తున్నారు. తాజాగా తనపై జరిగిన దాడి గురించి ఆయన తన లింక్డన్ ప్రొఫైల్‌లో పోస్టు చేశారు. తల, ముఖం, మెడ, ఛాతి, చేతులు కాళ్లపై యువకులు దాడి చేసినట్టు పేర్కొన్నారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాలో ఈ ఘటనపై ఆయన సుధీర్ఘమైన పోస్టు చేశారు. 
 
భారతీయ సంతతి వ్యక్తులపై ఐర్లాండ్‌లో దాడులు పెరుగుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. డిన్నర్ చేసిన తర్వాత తన అపార్టుమెంట్‌ వద్ద వాకింగ్ చేస్తున్న సమయంలో ఆరుగురు వ్యక్తులు దాడి చేసిట్టు సంతోశ్ యాదవ్ తెలిపారు. తన కంటి అద్దాలను తీసివేసి, నిర్దాక్షిణ్యంగా తల, మెడపై దాడి చేశారన్నారు. రోడ్డుపైనే రక్తం కారుతున్న దశలో తనను వదిలివేయడంతో అంబులెన్స్‌కు ఫోన్ చేశానని, వాళ్లు ఆస్పత్రికి తరలించినట్టు తెలిపారు. తన దవడ ఎముక విరిగినట్టు మెడికల్ వైద్య బృందం పేర్కొనట్టు తన పోస్టులో తెలిపారు.
 
కొన్ని రోజుల క్రితం ఇదే కోవలో డబ్లిన్‌లోనే ఓ భారతీయుడుపై దాడి జరిగింది. చిన్న పిల్లలతో అనుచితంగా ప్రవర్తించాడనే నెపంతో ఒక గుంపు భారత వ్యక్తిపై దాడికి పాల్పడింది. ఈ ఘటన జరిగిన తర్వాత వారం రోజుల తర్వాత మళ్లీ ఇపుడు జాత్యహంకార దాడి వెలుగులోకి వచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాణామతి బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న చిత్రం చేతబడి

Samantha: సమంత, రాజ్ కలిసి డిన్నర్ చేశారా? కారులో జతగా కనిపించారుగా! (video)

వార్ 2 లో హృతిక్ రోషన్, కియారా అద్వానీ లిప్ కిస్ ల రొమాంటిక్ సాంగ్

Kingdom Review: కింగ్ డమ్ తో విజయ్ దేవరకొండ కు సక్సెసా ! కాదా ! - కింగ్ డమ్ రివ్యూ

హిట్ అండ్ రన్ కేసులో సినీ నటి గౌతమి కశ్యప్ అరెస్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments