Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాగింగ్‌కు వచ్చిన మహిళ.. నీలి చిత్రం చూసి రెచ్చిపోయిన వృద్ధుడు...

Webdunia
బుధవారం, 12 ఆగస్టు 2020 (17:19 IST)
ఒంటరిగా జాగింగ్‌కు వచ్చిన ఓ మహిళపై ఓ వృద్ధుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. తన వ్యానులో నీలి చిత్రాలు చూస్తూ కూర్చొన్న భారత సంతతికి చెందిన 60 యేళ్ళ వృద్ధుడు రెచ్చిపోయి లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ ఘటన సింగపూర్‌లో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సింగపూర్‌లో ఫుడ్‌ డెలివరీ డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్న 60 ఏండ్ల కన్నన్‌ సుకుమారన్‌ ఈ ఏడాది మే 12 రాత్రి 7.30 గంటల సమయంలో వ్యాన్ లోపల నీలి చిత్రాలు చూస్తూ కూర్చున్నాడు. 
 
ఇదేసమయంలో ఓ 36 యేళ్ళ మహిళ అటువైపు జాగింగ్‌ రావడంతో ఆమెను చూసి సుకుమారన్‌ మరింత రెచ్చిపోయాడు. వెంటనే వ్యాన్‌ దిగి ఆమెను చెట్ల పొదల్లోకి లాక్కెళ్లి లైంగిక దాడికి యత్నించాడు.
 
ఆ మహిళ ప్రతిఘటించడంతో సుకుమారన్‌ ఆమెను ఛాతీ మీదుగా కొట్టాడు. దీంతో ఆమె కింద పడిపోయి సుకుమారన్‌ చేతిని గట్టిగా కొరికి సాయం కోసం కేకలు పెట్టింది. బాధితురాలి అరుపులు విని ఘటనా స్థలానికి మరో మహిళ రావడంతో సుకుమారన్‌ వ్యాన్‌ వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లిపోయాడు. 
 
వచ్చిన మహిళ సుకుమారన్‌ వ్యాన్‌ నెంబర్‌ను నోట్‌ చేసుకొని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తర్వాత పోలీసులు అతడిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పర్చగా పలు వాయిదాల అనంతరం మంగళవారం సింగపూర్‌ న్యాయ శాఖ అతడికి నాలుగేళ్ళ మూడు నెలల పాటు జైలు శిక్ష విధించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: షూటింగ్ స్పాట్ లో ఎన్.టి.ఆర్.కు ప్రశాంత్ నీల్ కితాబు

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం