Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాణిజ్య నౌకల కోసం.. ఏకమైన భారత్‌-చైనా బలగాలు

వాస్తవానికి భారత్, చైనాలు బద్ధ శత్రువులు. ఈ రెండు దేశాలు ఒక్క విషయంలో ఏకమయ్యాయి. అదే అరేబియా సముద్రంలో దొంగల బారి నుంచి వాణిజ్య నౌకలను కాపాడేందుకు భారత్‌-చైనా నావికాదళాలు సంయుక్తంగా చర్యలు చేపట్టాయి.

Webdunia
ఆదివారం, 9 ఏప్రియల్ 2017 (15:58 IST)
వాస్తవానికి భారత్, చైనాలు బద్ధ శత్రువులు. ఈ రెండు దేశాలు ఒక్క విషయంలో ఏకమయ్యాయి. అదే అరేబియా సముద్రంలో దొంగల బారి నుంచి వాణిజ్య నౌకలను కాపాడేందుకు భారత్‌-చైనా నావికాదళాలు సంయుక్తంగా చర్యలు చేపట్టాయి. మలేషియాలోని కెలాంగ్‌కు పోర్ట్‌ఆఫ్‌ అడెన్‌కు మధ్య ప్రయాణిస్తున్న ఒక భారీ వాణిజ్య నౌకపై సముద్ర దొంగలు దాడిచేశారు. దీనిని రక్షించేందుకు ఐఎన్‌ఎస్‌ ముంబై, ఐఎన్‌ఎస్‌ తారక్ష్ రంగంలోకి దిగాయి. 
 
ది యునైటెడ్‌ కింగ్‌డమ్‌ ట్రేడ్‌ ఆర్గనైజేషన్‌(యుకేఎంటీవో) నుంచి వచ్చిన సమాచారం మేరకు ఈ నౌకలు రంగంలోకి దిగాయి. ఇది దాదాపు 21,000 కిలోమీటర్ల మేరకు సముద్రాన్ని పరిశీలిస్తుంటుంది. ఈ మార్గాన్ని చైనా, ఇటలీ, పాకిస్థాన్‌కు చెందిన నౌకలు కూడా పరిరక్షిస్తుంటాయి. ఈ దేశాల నౌకలు కూడా స్పందించాయి. 
 
కానీ భారత నావికాదళం వేగంగా స్పందించి సదరు వాణిజ్య నౌకకు ఒక హెలికాప్టర్‌ను పంపించింది. అదేసమయంలో చైనాకు చెందిన ప్రత్యేక బలగాలు నౌకలోకి ప్రవేశించి సముద్రదొంగల కోసం గాలింపు చేపట్టాయి. దీంతో సముద్రదొంగలు పరారయ్యారు. ఈ సందర్భంగా చైనా బలగాలు.. భారత బలగాలకు కృతజ్ఞతలు తెలిపాయి.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments