Webdunia - Bharat's app for daily news and videos

Install App

హద్దుమీరితే అణుదాడికి వెనుకాడం.. అమెరికాకు ఉ.కొరియా హెచ్చరిక

అగ్రరాజ్యం అమెరికాకు ఉత్తర కొరియా హెచ్చరిక చేసింది. హద్దు మీరితే అణు దాడికి సైతం వెనుకాడబోమని తేల్చి చేప్పింది. దీంతో అమెరికా- ఉత్తరకొరియా మధ్య వైరం మరింత జఠిలంగా మారనుంది. అమెరికాకు చెందిన నావికాదళ

Webdunia
ఆదివారం, 9 ఏప్రియల్ 2017 (15:43 IST)
అగ్రరాజ్యం అమెరికాకు ఉత్తర కొరియా హెచ్చరిక చేసింది. హద్దు మీరితే అణు దాడికి సైతం వెనుకాడబోమని తేల్చి చేప్పింది. దీంతో అమెరికా- ఉత్తరకొరియా మధ్య వైరం మరింత జఠిలంగా మారనుంది. అమెరికాకు చెందిన నావికాదళ బృదం ఉత్తరకొరియా ద్వీపం సమీపంలోకి వెళ్లింది. దికార్ల్‌ విన్సాన్‌ స్ట్రైక్‌ గ్రూప్‌గా పిలిచే బృందం యుద్దనౌకలు, విమాన వాహకనౌకతో సహా ఆ ప్రాంతానికి వెళ్లాయి. అమెరికాలోని పసిఫిక్‌ కమాండ్‌ ఆదేశాల మేరకు అవి వెళ్లినట్లు సమాచారం. దీనిపై ఉత్తర కొరియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 
 
అలాగే, సిరియాలో ఇటీవ‌ల జ‌రిగిన ర‌సాయ‌న దాడికి ప్రతిగా షైరత్ వైమానిక స్థావరంపై అమెరికా క్షిపణులతో దాడి చేసిన విష‌యం తెలిసిందే. అయితే, అమెరికా చ‌ర్య‌ను ఉత్త‌ర‌కొరియా కూడా త‌ప్పుబ‌ట్టింది. ఒక సార్వభౌమాధికార దేశంపై చేసిన ఈ దాడి ఏమాత్రం సమ్మతించదగినది కాదని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. 
 
ఆ చ‌ర్య‌ క్షమించరానిదని, ఈ దాడి త‌మ‌కు చేసిన హెచ్చరికగా భావిస్తున్నామ‌ని ఉత్త‌ర కొరియా పేర్కొంది. ఇలాంటి దాడులు త‌మ దేశంపై కూడా ఏ క్షణమైనా జరగవ‌చ్చని అమెరికా పరోక్షంగా తెలిపిందని వ్యాఖ్యానించింది. అందుకే తాము త‌మ‌ సైనిక సంపత్తిని పెంచుకోవడంపై మరింత వేగాన్ని పెంచుతామ‌ని హెచ్చ‌రించింది. త‌మ‌కు తగిన సమయం వచ్చినప్పుడు తగిన విధంగా బదులిస్తామ‌ని ప్ర‌క‌టించింది. 

ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ ఆగస్ట్ లో ప్రైమ్ వీడియోలో సిద్ధం

డబుల్ ఇస్మార్ట్ లో అమ్మాయిలతో ఫ్లర్ట్ చేసే రామ్ గా దిమాకికిరికిరి టీజర్

రోజా, అనిల్ కుమార్ బాటలో సైలెంట్ అయిన రామ్ గోపాల్ వర్మ..?

ఎన్నికల ప్రచారం ఓవర్.. ఇక పవన్‌కు వేచి వున్న వేరే టాస్క్.. ఏంటది?

నటి రాఖీ సావంత్‌కు గుండె సమస్య.. ఆస్పత్రిలో చేరిక

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments