Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిడెన్‌కు భద్రత పెంపు..!

Webdunia
శనివారం, 7 నవంబరు 2020 (08:39 IST)
అగ్ర రాజ్యంలో తదుపరి అధ్యక్ష పీఠాన్ని ఎవరు అధిరోహిస్తారో ఇంకా అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే వెలువడిన ఫలితాల ప్రకారం వెనుకబడ్డారు. ఇంకా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. అయితే ఇప్పటికే మ్యాజిక్‌ ఫిగర్‌కి చేరువగా బిడెన్‌ చేరుకోగా... గెలుపు తనదేనని విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో అందుకు తగ్గట్లు బిడెన్‌కు భద్రతను పెంచుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. బిడెన్‌ భద్రతను పెంచేందుకు అమెరికా సీక్రెట్‌ సర్వీసు సంస్థ అధికారులను పంపినట్లు స్థానిక పత్రిక వాషింగ్టన్‌ పోస్టు తెలిపింది.

మరికొద్ది సేపట్లో బిడెన్‌ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారని సమాచారం. దీంతో ఆయనకు భద్రత పెంచేందుకు సీక్రెట్‌ సర్వీస్‌ ఏర్పాట్లు చేస్తోందని, ఈ ప్రణాళికల్లో భాగమైన ఇద్దరు అధికారులు చెప్పినట్లు సదరు పత్రిక వెల్లడించింది.

ప్రసంగానికి విల్మింగ్టన్‌ సెంటర్‌ను వినియోగించుకునే అవకాశం ఉందని బిడెన్‌ ప్రచార వర్గం సీక్రెట్‌ సర్వీసుకు సమాచారం ఇచ్చిందని, ఆ మేరకు ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments