Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పుతిన్‌ పెంపుడు కుక్కపిల్ల ట్రంప్: బిడెన్‌

Advertiesment
Putin
, బుధవారం, 30 సెప్టెంబరు 2020 (17:04 IST)
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలకు నెల రోజుల వ్యవధి మాత్రమే ఉన్న నేపథ్యంలో.. అధ్యక్ష అభ్యర్థులిద్దరూ మాటల కత్తులు దూసుకున్నారు.

అధ్యక్ష అభ్యర్థుల తొలి బహిరంగ చర్చ కరోనా నిబంధనల ప్రకారం.. కరచాలనం చేయకుండానే ప్రారంభమయింది. '' హౌ ఆర్‌ యూ మ్యాన్‌'' అంటూ డెమొక్రాటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌ అధ్యక్షుడు ట్రంప్‌ను పలకరించారు.

పలు అంశాలపై ఇద్దరి మధ్య కొనసాగిన ఆసక్తికర చర్చలో ఇద్దరు అభ్యర్థుల వైఖరిని తెలుసుకునేందుకు అమెరికా పౌరులతో సహా ప్రపంచమంతా ఆసక్తిగా తిలకించింది.
 
కరోనా వైరస్‌, తదితర కీలక అంశాల గురించి చర్చించే క్రమంలో.. ఇద్దరు అధ్యక్ష అభ్యర్థుల మధ్య రాజకీయ వేడి రాజుకుంది.

' మీరు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ పెంపుడు కుక్క పిల్ల. నేను పుతిన్‌తో హోరాహోరీ తలపడ్డాను. మేము ఏమాత్రం లొంగలేదు. కానీ ఈయన (ట్రంప్‌) పుతిన్‌ పెంపుడు కుక్క పిల్ల మాదిరిగా వ్యవహరించారు ' అని ట్రంప్‌ పై బైడెన్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో సహనం కోల్పోయిన ట్రంప్‌.. 'షటప్‌' అంటూ.. ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బురద వదలి వరద బాధితులను ఆదుకోండి : లోకేశ్‌