Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంసారయోగం లేని ఇమ్రాన్ ఖాన్... పెటాకులైన మూడో పెళ్లి

పాకిస్థాన్ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్‌కు సంసారయోగం లేనట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఆయన పెళ్లి చేసుకున్న ఇద్దరు భార్యలు ఆయనకు దూరమయ్యారు. రెండు నెలల క్రితం మూడో పెళ్లి చేసుకున్నప్పటికీ ఆమెతో కూడా సఖ్యత కుద

Webdunia
బుధవారం, 25 ఏప్రియల్ 2018 (15:07 IST)
పాకిస్థాన్ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్‌కు సంసారయోగం లేనట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఆయన పెళ్లి చేసుకున్న ఇద్దరు భార్యలు ఆయనకు దూరమయ్యారు. రెండు నెలల క్రితం మూడో పెళ్లి చేసుకున్నప్పటికీ ఆమెతో కూడా సఖ్యత కుదరలేదు. దీంతో ఇమ్రాన్ మూడో పెళ్లి పెటాకులైంది.
 
పాకిస్థాన్ క్రికెట్ మాజీ కెప్టెన్, తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్‌ను మూడో భార్య బుష్రా మనేకా వదిలిపెట్టి, తన పుట్టింటికి వెళ్లిపోయిందని పాకిస్థాన్ మీడియా వెల్లడించింది. వీరిద్దరి మధ్య విభేదాలు రావడానికి బుష్రా మనేకా కొడుకే కారణమని తెలిపింది. 
 
మనేకా కొడుకు తమతో పాటు ఉండటం ఇమ్రాన్‌కు ఇష్టం లేదట. మరోవైపు, ఇమ్రాన్ ఇష్టంగా పెంచుకుంటున్న కుక్కలు మనేకాకు నచ్చలేదట. దీంతో, ఎవరిదారి వారు చూసుకున్నారని పాక్ మీడియా కథనం.
 
పెళ్లికి ముందే ఇమ్రాన్, మనేకాల మధ్య ఒక ఒప్పందం కుదిరిందట. మనేకా బంధువులు ఎవరూ ఎక్కువ రోజులు తమ వద్ద ఉండకూడదనేని ఆ ఒప్పందం. ఈనేపథ్యంలో, మనేకా కుమారుడు తమ ఇంట్లోనే ఉండటం ఇమ్రాన్‌కు చికాకు కలిగించింది. ఖవర్ ఫరీద్ అనే వ్యక్తితో మనేకాకు ఇంతకు ముందే పెళ్లయింది. వీరిద్దరికీ ఒక కుమారుడు ఉన్నాడు. 
 
మరోవైపు, ఇమ్రాన్ చెల్లెళ్లు కూడా అదే ఇంట్లో ఉంటున్నారు. వారికి మనేకాను ఇమ్రాన్ పెళ్లి చేసుకోవడం ఏమాత్రం ఇష్టం లేదు. వీరి వల్ల కొత్త దంపతులు ఇద్దరి మధ్య అగాథం బాగా పెరిగిపోయింది. చివరకు ఎవరి దారి వారు చూసుకున్నారు. 1995లో జమీమాను, 2015లో టీవీ యాంకర్ రేహమ్ ఖాన్‌ను ఇమ్రాన్ పెళ్లాడిన సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments