Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత ప్రధానిగా మళ్లీ మోడీనే రావాలి : ఇమ్రాన్ ఖాన్

Webdunia
బుధవారం, 10 ఏప్రియల్ 2019 (14:45 IST)
భారత్ ప్రధాని పగ్గాలను మళ్లీ నరేంద్ర మోడీనే చేపట్టాలని పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ఇండియాలో లోక్‌సభ తొలి విడత ఎన్నికల పోలింగ్ సమయం సమీపిస్తున్న నేపథ్యంలో ఇమ్రాన్ ఇలా అనడంపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ మాజీ క్రికెటర్ కోరిక వెనుక కారణాలు కూడా ఉన్నాయి. 
 
మోడీ ప్రధాన మంత్రి అయితే కాశ్మీర్ సమస్య ఓ కొలిక్కి వస్తుందని, కాంగ్రెస్ పాలనలోకి వస్తే వ్యవహారం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంటుందని, వారు నిర్ణయాలు తీసుకోవడంలో వెనుకాడుతారని చెప్పారు. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కాంగ్రెస్ ప్రభుత్వం రైట్ వింగ్‌కు భయపడుతుందని అభిప్రాయపడ్డారు. 
 
భాజపా ప్రతిపక్షంలో ఉంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్నా కాశ్మీర్ వంటి కీలకమైన అంశాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకోలేదని ఇమ్రాన్ వ్యాఖ్యానించారు. మోడీ అయితే ధైర్యంగా నిర్ణయాలు తీసుకోగలరని ఆశాభావం వ్యక్తంచేశారు.
 
భారత్‌లో ముస్లింలు గతం నుంచి సురక్షితంగానే ఫీలయ్యే వారని అయితే హిందూ అతివాదం వల్ల ఇండియాలోని ముస్లింలలో కొంత భయం నెలకొని ఉందని మాత్రం ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో మోడీకి ఇమ్రాన్ మంచి కితాబు ఇచ్చినట్లయింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments