Webdunia - Bharat's app for daily news and videos

Install App

తీరం దాటిన ఇర్మా... ధ్వంసమైన జైలు.. పారిపోయిన ఖైదీలు..

క‌రీబియ‌న్ దీవులు, క్యూబాను ముంచెత్తిన హ‌రికేన్ ఇర్మా.. ఇక అమెరికాలోని ఫ్లోరిడాలోని కీస్ వద్ద తీరం దాటింది. ఇర్మా తీరం దాటే స‌మ‌యంలో గంట‌కు 209 కిలోమీట‌ర్ల వేగంతో గాలులు వీచాయి. ఇర్మా తుఫాను అమెరికా చ

Webdunia
సోమవారం, 11 సెప్టెంబరు 2017 (07:08 IST)
క‌రీబియ‌న్ దీవులు, క్యూబాను ముంచెత్తిన హ‌రికేన్ ఇర్మా.. ఇక అమెరికాలోని ఫ్లోరిడాలోని కీస్ వద్ద తీరం దాటింది. ఇర్మా తీరం దాటే స‌మ‌యంలో గంట‌కు 209 కిలోమీట‌ర్ల వేగంతో గాలులు వీచాయి. ఇర్మా తుఫాను అమెరికా చరిత్రలో కనీవినీ ఎరుగని బీభత్సం సృష్టించింది. ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. ఇర్మా తుఫాను ధాటికి ఫ్లోరిడాలోని అనేక ప్రాంతాలు నేలమట్టమయ్యాయి. అలాగే, ద‌క్షిణ ఫ్లొరిడాలోని 4.2 ల‌క్ష‌ల ఇండ్ల‌కు విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిచిపోయింది. ఇర్మా తుఫాను ధాటికి ఇప్ప‌టి వ‌ర‌కు 20 మంది మృతి చెందారు. వెంట‌నే స‌హాయ‌క చ‌ర్య‌లను ప్రారంభించారు. 
 
అయితే, ఇర్మా తుఫాను జైలు ఖైదీలకు ఎంతో మేలు చేసింది. ఏకంగా వందమందికిపైగా ఖైదీలకు విముక్తి ప్రసాదించింది. అట్లాంటిక్ సముద్రంలోని  బ్రిటిష్ వర్జిన్ ఐలండ్స్‌లో ఉన్న జైలు పైభాగం ఇర్మా దెబ్బకు ధ్వంసమైంది. దీంతో దొరికిందే సందని సంబరపడిన ఖైదీలు వెంటనే జైలు నుంచి పరారయ్యారు. వారిని నిలువరించడం అక్కడి గార్డులకు కష్టతరంగా మారడంతో ఖైదీలు గోడదూకి పారిపోతుంటే జైలు సిబ్బంది చేష్టలుడిగి చూస్తుండిపోయారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments