Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాలం చేతబట్టుకుని చేపలవేటకెళ్లాడు... బోటుతో సహా లాక్కెళ్లిన షార్క్

ఓ వేటగాడికి చేదు అనుభవం ఎదురైంది. గాలం చేతబట్టుకుని చేపలు పట్టేందుకు వెళ్లిన వేటగాడు... సొరచేపకు బలయ్యాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... పశ్చిమ ఆస్ట్రేలియాలోని ఓ యువకుడు చేపలు పట్

Webdunia
బుధవారం, 4 జనవరి 2017 (12:46 IST)
ఓ వేటగాడికి చేదు అనుభవం ఎదురైంది. గాలం చేతబట్టుకుని చేపలు పట్టేందుకు వెళ్లిన వేటగాడు... సొరచేపకు బలయ్యాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... పశ్చిమ ఆస్ట్రేలియాలోని ఓ యువకుడు చేపలు పట్టేందుకు వెళ్లాడు. సముద్రంలో గాలం వేయగానే 400 కిలోల బరువు ఉన్న భారీ చేప పట్టుబడింది. 
 
ఈ విషయం తెలియని అతను దానిని పడవలోకి లాగేందుకు బలంగా ప్రయత్నించాడు. దీంతో ఆ చేప ఒక్కసారిగా అతన్ని నీళ్లలోకి లాగి చాలా దూరం లాక్కెళ్లిపోయింది. చివరికి షార్క్‌లు తిరిగే సుదూర జలాల్లో వదిలేసింది. ఆ మార్గంలో ప్రయాణిస్తున్న కొందరు ఖాళీ బోటును చూసి అధికారులకు సమాచారం అందించగా... వారు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు. 
 
కొన్ని గంటల అనంతరం అతడి ఆచూకీ కనుగొన్నారు. చల్లటి నీటి కారణంగా అతను హైపోథర్మియాకు గురికావడంతో ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. గాలింపు బృంద కమాండర్‌ మాట్లాడుతూ సదరు వ్యక్తి అదృష్టం కొద్దీ ప్రాణాలతో బయటపడ్డారని చెప్పారు. గత ఏడాది కూడా ఇదే ప్రాంతంలో ఇద్దరు చేపలు పట్టేందుకు వెళ్లి గల్లంతయ్యారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments