Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగళూరులో నడిరోడ్డుపై యువతిపై కామాంధుడు కౌగిలింతలు, ముద్దులు... రెండోవాడికీ అందించి...(Video)

నిర్భయ లాంటి ఘటనలు జరిగినా.. కఠినమైన చట్టాలు రావట్లేదు. మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతూనే ఉన్నాయి. అర్థరాత్రి ఒంటరిగా ఆడపిల్ల కనిపిస్తే చాలు.. కామాంధులు గురిపెట్టి... విరుచుకుపడుతున్నారు. అలాంటి స

Webdunia
బుధవారం, 4 జనవరి 2017 (14:03 IST)
నిర్భయ లాంటి ఘటనలు జరిగినా.. కఠినమైన చట్టాలు రావట్లేదు. మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతూనే ఉన్నాయి. అర్థరాత్రి ఒంటరిగా ఆడపిల్ల కనిపిస్తే చాలు.. కామాంధులు గురిపెట్టి... విరుచుకుపడుతున్నారు. అలాంటి సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన సంఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. 
 
జాతిపిత మహాత్మాగాంధీ కల ఇంకా నెరవేరలేదు. అర్థరాత్రి మహిళ నిశ్చింతగా నడిచిపోయే రోజులు రాలేదు. ఇందుకు ఈ ఘటనే ఉదాహరణ. నూతన సంవత్సర వేళ.. కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా బెంగళూరు మహానగరంలోని మహిళల పట్ల కొందరు మగాళ్ల అనుచిత వైఖరి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించిన ఒక వీడియో తాజాగా బయటకు వచ్చింది.
 
సోషల్‌ మీడియాలో సంచలనంగా మారిన ఈ వీడియో చూస్తున్న వారంతా షాక్‌కు గురి అవుతున్నారు. బెంగళూరు నగరంలోని కమ్మాన్‌హళ్లీ రోడ్డు నెంబరు 5లో చోటుచేసుకున్న ఒక దారుణం సీసీ కెమేరా ఫుటేజ్‌ పుణ్యమాని బయటకు వచ్చింది. ఓ యువతి నూతన సంవత్సరం వేళలో.. కమ్మన్‌హళ్లీ 5వ నెంబర్‌ రహదారిలో ఆటో దిగి ఇంటికి నడుచుకుంటూ వెళుతోంది. ఇంటికి కూతవేటు దూరంలో ఉండగా.. ఇద్దరు ఆకతాయిలు ద్విచక్ర వాహనంపై ఆమెను టీజ్‌ చేసుకుంటూ వెళ్లి దూరంగా ఆగారు.
 
ఆ మహిళ నడుచుకుంటూ వస్తుండగా ఆకతాయిల్లో ఒకడు వాహనం దిగి ఆమెను బలవంతంగా పట్టుకున్న వైనం సీసీ కెమేరాల్లో నిక్షిప్తమైంది. అతడి కబంధ హస్తాల నుంచి విడిపించుకోవడానికి ఆమె విశ్వప్రయత్నం చేసింది. అయినప్పటికీ ఆ మృగాడు ఆమెను వదల్లేదు. రోడ్డు మధ్యన బాధితురాలిని పట్టుకున్న అతడు.. తనతో వాహనంపై వచ్చిన వాడి వైపునకు ఆమెను బలవంతంగా తీసుకెళ్లాడు. ఆ రెండో వ్యక్తి కూడా ఆమెను పట్టుకొని భౌతికదాడికి పాల్పడ్డాడు. 
 
అనంతరం ఆమెను రోడ్డుపై పడేసి తమ దారిన తాము వెళ్లిపోయారు. దారుణమైన విషయం ఏమిటంటే.. రోడ్డు మీద ఇంత దారుణం జరుగుతున్నా.. ఆ మార్గంలో ప్రయాణించే పలువురు ఆగి మరీ చూశారే కానీ ఒక్కరు కూడా ఆ యువతిని రక్షించేందుకు సాహసించలేదు. ఇదంతా అక్కడ ఓ ఇంటికి అమర్చిన సీసీ కెమేరాలో నమోదైంది. దీనిని ఆ ఇంటివారు మీడియాకు అందజేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడీ వీడియో ఫుటేజ్‌ సోషల్‌ మీడియాలో షాకింగ్‌ సంచలనంగా మారింది.

 

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments