Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరెంజ్ జ్యూస్ తాగడానికి వెళితే అదృష్టం అలా కలిసివచ్చింది...

ఠాగూర్
మంగళవారం, 12 నవంబరు 2024 (15:25 IST)
ఓ మహిళకు అదృష్టం అలా కలిసివచ్చింది. ఆరెంజ్ జ్యూస్ తాగేందుకు వెళ్లిన మహిళ ధనవంతురాలైపోయింది. ఆమె కలలో కూడా ఊహించనంత డబ్బుదక్కింది. నార్త్ కరోలినాలోని కెర్నర్స్ విల్లేకు చెందిన కెల్లీ స్పార్ అనే మహిళ ఆరెంజ్ జ్యూస్ తాగడానికి 'క్వాలిటీ మార్ట్' అనే దుకాణానికి వెళ్లింది. జ్యూస్ తాగుతుండగా అక్కడే ఉన్న గ్యాస్ స్టేషన్‌లోని లాటరీ టికెట్లపై ఆమె దృష్టి పడింది. వెంటనే తాగడం ఆపి వెళ్లి 20 డాలర్లతో ఒక టికెట్‌ను కొనుగోలు చేసింది. ఆ టిక్కెట్‌ను స్క్రాచ్ చేసి చూడగా 'టాప్ ప్రైజ్ విన్నర్' అని ఉంది. దీంతో ఆమె 2,50,000 డాలర్లు (సుమారు రూ.2.10 కోట్లు) గెలుచుకుంది. దీంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. 
 
దీనిపై ఆమె స్పందిస్తూ, 'గ్యాస్ స్టేషన్ వద్ద కొత్త లాటరీ టిక్కెట్లు ఉన్నాయని గమనించాను. ఒక టికెట్ కొనుగోలు చేయాలని అనుకున్నాను. కింది భాగంలో మడత ఉన్న టికెట్ నా దృష్టిని ఆకర్షించింది. కొనుగోలు చేశాను' అని కెల్లి స్పార్ పేర్కొంది. ఈ డబ్బు తమ కుటుంబ స్వరూపాన్ని మార్చుతుందని, చాలా ఉపయోగపడుతుందని ఆమె హర్షం వ్యక్తం చేసింది. జీవితాలను మార్చివేసే డబ్బు అని, కొత్త అవకాశాలను దగ్గర చేస్తుందని ఆమె పేర్కొంది.
 
కెల్లీ స్పార్ మాదిరిగానే ఇటీవల ఓ సాధారణ ఉద్యోగికి ఏకంగా 3 మిలియన్ డాలర్ల (రూ.25.24 కోట్ల) లాటరీ తగిలింది. లంచ్ బాక్స్ మరచిపోయారంటూ ఆఫీస్‌కు వెళుతున్న అతడికి భార్య ఫోన్ చేసి చెప్పడంతో... తిరిగి ఇంటికి వెళ్తే ఆలస్యమవుతుందేమోనని మార్గమధ్యంలో ఒక దుకాణానికి వెళ్లాడు. అక్కడ కనిపించిన లాటరీ టికెట్ కొనుగోలు చేయగా అతని తలరాత మారిపోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments