Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సూసీ వైల్స్‌.. ఇంతకీ ఎవరామె.. డొనాల్డ్ ట్రంప్ ఎందుకలా చేశారు?

Advertiesment
Susie Wiles_Trump

సెల్వి

, శుక్రవారం, 8 నవంబరు 2024 (09:58 IST)
Susie Wiles_Trump
అమెరికా చరిత్రలోనే మొదటి మహిళా వైట్​హౌస్​ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తన ఎన్నికల ప్రచార మేనేజర్‌ సూసీ వైల్స్‌ నిలిచారు.  వాస్తవానికి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్​ ట్రంప్‌ను విజయతీరాలకు చేర్చడంలో సూసీ వైల్స్​ది కీలక పాత్ర. అందుకే అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తన ఎన్నికల ప్రచార మేనేజర్‌ సూసీ వైల్స్‌‌కు కీలక బాధ్యతలు అప్పగించారు. 
 
ఎంతో పకడ్బందీగా, అత్యంత క్రమశిక్షణతో ట్రంప్‌ తన ప్రచారాన్ని నిర్వహించడం వెనుక ఆమె ముఖ్య పాత్ర పోషించారు. ట్రంప్‌ తన విజయ ప్రసంగంలో ఆమెకు మాట్లాడేందుకు అవకాశం ఇచ్చినా, సూసీ సున్నితంగా నిరాకరించారు. 
 
"సూసీ వైల్స్​ చాలా కఠినమైన, తెలివైన, వినూత్న ఆలోచనలు కలిగిన వ్యక్తి. ప్రపంచవ్యాప్తంగా ఆమె గౌరవం, ప్రశంసలు పొందారు. అమెరికాను మళ్లీ గొప్పగా మార్చేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తారు. దేశం గర్వపడేలా ఆమె పనిచేస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు" అని ట్రంప్ వెల్లడించారు. కాగా వైల్స్‌కు విస్తృతమైన ఫెడరల్ ప్రభుత్వ అనుభవం లేనప్పటికీ, ఆమె అధ్యక్షులుగా ఎన్నికైన వారితో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రధాని నరేంద్ర మోడీని కలిసి మై హోమ్ గ్రూప్ అధినేత