Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాలో కరోనా మృతులు 1807 - ప్రమాదకరస్థితిలో వైద్య సిబ్బంది...

Webdunia
మంగళవారం, 18 ఫిబ్రవరి 2020 (14:35 IST)
చైనా వ్యాప్తంగా కరోనా వైరస్ బారిన పడినవారిలో సోమవారం మరో 93 మంది మరణించారు. దీంతో ఇప్పటివరకు మొత్తంగా చనిపోయినవారి సంఖ్య 1,863కు చేరిందని అధికారులు అధికారికంగా ప్రకటించారు. మొత్తంగా వైరస్ సోకిన వారి సంఖ్య 72,300కు చేరిందని తెలిపారు. 
 
సోమవారం అర్థరాత్రి వరకు కొత్తగా 1,807 కేసులు నమోదయ్యాయని చెప్పారు. కొత్తగా వైరస్ బారిన పడుతున్నవారి సంఖ్య తగ్గుతోందని, త్వరలోనే కరోనా నియంత్రణలోకి వస్తుందని ప్రకటించారు. 
 
మరోవైపు, కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా ఉంది. దీన్ని వ్యాప్తిని అరికట్టేందుకు ఎన్నో రకాలైన చర్యలు తీసుకుంటున్నా అవి ఏమాత్రం పనిచేయడం లేదు. ఫలితంగా వైరస్ వ్యాప్తి విపరీతంగా పెరిగిపోతోంది. ఈ కారణంగా చైనాలో మెడికల్ స్టాఫ్ ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తున్నారు. ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నా కూడా మెడికల్ స్టాఫ్‌కు కరోనా వైరస్ సోకుతోంది. 
 
ఇప్పటివరకు 1,716 మంది మెడికల్ స్టాఫ్ కరోనా వైరస్ బారిన పడ్డారని, అందులో ఆరుగురు చనిపోయారని అధికారులు వెల్లడించారు. వూహాన్‌లోని ఆసుపత్రుల్లో వేలాది మంది చికిత్స పొందుతున్నారని.. మెడికల్ స్టాఫ్కు సరిపడా మాస్కులు, ప్రొటెక్టివ్ సూట్లు అందుబాటులో లేవని కొందరు హెల్త్ వర్కర్లు ఆరోపించారు. 
 
ఇదిలావుంటే, చైనాలో కరోనా వైరస్ వ్యాప్తికి కేంద్ర స్థానమైన వూహాన్ నగరంలో వుహాన్ ఆస్రత్రి డైరెక్టర్ ల్యూ జిమింగ్  కూడా వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. ఆయనను రక్షించడానికి అన్ని ప్రయత్నాలు చేశామని, అయినా కాపాడుకోలేకపోయామని చైనా నేషనల్ హెల్త్ కమిషన్ మంగళవారం ప్రకటించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీరామ్ వేణు ను తమ్ముడు రిలీజ్ ఎప్పుడంటూ నిలదీసిన లయ, వర్ష బొల్లమ్మ

దుల్కర్ సల్మాన్ చిత్రం ఐ యామ్ గేమ్ తిరువనంతపురంలో ప్రారంభం

థగ్ లైఫ్.. ఫస్ట్ సింగిల్ జింగుచా రిలీజ్, సినిమా జూన్లో రిలీజ్

జగదేక వీరుడు అతిలోక సుందరి క్రేజ్, రూ. 6 టికెట్ బ్లాక్‌లో రూ. 210

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments