Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్ సెనేట్‌కు హిందూ దళిత మహిళ...

పాకిస్థాన్‌‌లో భారత హిందూ మహిళకు అరుదైన గౌరవం జరిగింది. సింధ్ ప్రావిన్స్‌కు చెందిన హిందూ మహిళ చరిత్ర సృష్టించింది. పాకిస్థాన్‌ సెనేట్‌కు హిందూ దళిత మహిళ కృష్ణకుమారి కోల్హి ఎన్నికైనట్టు పాకిస్థాన్ పీపు

Webdunia
ఆదివారం, 4 మార్చి 2018 (15:22 IST)
పాకిస్థాన్‌‌లో భారత హిందూ మహిళకు అరుదైన గౌరవం జరిగింది. సింధ్ ప్రావిన్స్‌కు చెందిన హిందూ మహిళ చరిత్ర సృష్టించింది. పాకిస్థాన్‌ సెనేట్‌కు హిందూ దళిత మహిళ కృష్ణకుమారి కోల్హి ఎన్నికైనట్టు పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ తెలిపింది. 39 ఏళ్ల కోల్హి పీపీపీ సభ్యురాలిగా ఉంది. 
 
ఆమెకు సింధ్‌లోని మైనారిటీ సీటుకు పీపీపీ సెనేట్ టిక్కెట్ ఇచ్చింది. ఇది పాకిస్థాన్‌లో మహిళలు, మైనారిటీ హక్కులకు లభించిన అరుదైన గౌరవంగా పీపీపీ పేర్కొంది. గతంలో రత్న భగవాన్‌దాస్ చావ్లాను తొలి హిందూ మహిళా సెనేటర్‌గా పీపీపీ ఎన్నుకుంది.
 
సింధ్ ప్రావిన్స్‌లోని ధర్ జిల్లా నాగర్‌పర్కర్ శివారు గ్రామానికి చెందిన కోల్హి పేద వ్యవసాయ కుటుంబంలో 1979లో జన్మించారు. 9వ తరగతిలో ఉండగా 16 ఏళ్ల ప్రాయంలోనే లాల్‌చంద్ అనే వ్యక్తిని పెళ్లాడింది. ఆ తర్వాత కూడా విద్యాభ్యాసం కొనసాగించిన కోల్హి 2013లో సింధు యూనివర్శిటీలో సోషియాలజీలో మాస్టర్స్ చేసింది. 

సంబంధిత వార్తలు

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments