ఐఎన్ఎక్స్ మీడియా అవినీతి కేసులో తదుపరి దర్యాప్తు కోసం కార్తి చిదంబరాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ఆదివారం ముంబై తీసుకెళ్ళింది. మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం కుమారుడు కార్త
ఐఎన్ఎక్స్ మీడియా అవినీతి కేసులో తదుపరి దర్యాప్తు కోసం కార్తి చిదంబరాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ఆదివారం ముంబై తీసుకెళ్ళింది. మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం కుమారుడు కార్తిని ఢిల్లీ సెషన్స్ కోర్టు గురువారం ఐదు రోజుల సీబీఐ కస్టడీకి ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఈనెల 6వ తేదీన కార్తీ చిదంబరంను చెన్నై విమానాశ్రయంలో అరెస్టు చేసిన విషయం తెల్సిందే.
ఐఎన్ఎక్స్ మీడియాకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల మండలి అనుమతులు రావడం వెనుక కార్తి చిదంబరం హస్తం ఉందని సీబీఐ ఆరోపించింది. ఆ సమయంలో ఆయన తండ్రి పి.చిదంబరం యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర ఆర్థికమంత్రిగా పని చేశారని తెలిపింది. సీబీఐ, ఈడీ కార్తిపై మరిన్ని కేసులు దాఖలు చేసే అవకాశం ఉందని ఓ వార్తా సంస్థ తెలిపింది.
ఐఎన్ఎక్స్ మీడియా సహ వ్యవస్థాపకురాలు ఇంద్రాణీ ముఖర్జియా, కార్తి చిదంబరాలను ముంబైలో ఎదురెదురుగా పెట్టి సీబీఐ విచారణ జరుపుతుందని తెలుస్తోంది. పీటర్ ముఖర్జియా, కార్తి చిదంబరాలను కూడా ఇదేవిధంగా ప్రశ్నిస్తారని సమాచారం.