Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడేళ్లుగా టెంటులో నిద్రిస్తూ రూ.7 కోట్ల విరాళాలు సేకరించిన బాలుడు

Webdunia
శుక్రవారం, 10 మార్చి 2023 (10:20 IST)
బ్రిటన్‌కు చెందిన మ్యాక్స్‌ వూజీ అనే పదేళ్ళ బాలుడు ఓ ఆసుపత్రి స్వచ్ఛంద సంస్థకు నిధులు సమకూర్చడం కోసం సరికొత్త పంథా ఎంచుకున్నాడు. రోజూ రాత్రి పూట ఇంట్లో కాకుండా బయట టెంట్‌ వేసుకొని నిద్రపోయాడు. అలా మూడేళ్లపాటు నిర్విరామంగా దీన్ని కొనసాగించాడు. తద్వారా దాదాపు రూ.ఏడు కోట్ల నిధులు విరాళంగా వచ్చాయి. 
 
మ్యాక్స్‌ ఇంటి పక్కన గతంలో రిక్‌ అబాట్‌ అనే వ్యక్తి నివసించేవారు. ఆయన 74ఏళ్ల వయసులో క్యాన్సర్‌తో చనిపోయారు. అంతకుముందే రిక్‌ తన దగ్గరున్న టెంట్‌ను మ్యాక్స్‌కు ఇచ్చారు. దీంతో ఏదైనా సాహస కార్యం చేయమని ఆయన చెప్పిన మాటలు మ్యాక్స్‌లో స్ఫూర్తి నింపాయి. దాంతో 2020 మార్చిలో ఆరుబయట టెంట్‌లో నిద్రించాలని నిర్ణయం తీసుకున్నట్లు మ్యాక్స్‌ మీడియాకు తెలిపాడు. 
 
ఇలా చేయడం ద్వారా వచ్చిన మొత్తాన్ని ఓ స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఇవ్వాలనుకున్నట్లు ప్రకటించాడు. అప్పటి నుంచి మ్యాక్స్‌ను ప్రోత్సహిస్తూ పలువురు తనకు విరాళాలు పంపించారు. ఆ మొత్తం ఇప్పుడు దాదాపు రూ.7 కోట్లకు చేరింది. మ్యాక్స్‌ తన మూడేళ్ల టెంట్‌ నిద్రకు ముగింపుగా ఏప్రిల్‌ 1న ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటుచేశాడు. ఆ టికెట్ల విక్రయం ద్వారా వచ్చిన డబ్బును స్వచ్ఛంద సంస్థకు పంపిస్తానని తెలిపాడు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments