Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విమానంలో మళ్లీ అదే సీన్.. తోటి ప్రయాణికుడిపై మూత్ర విసర్జన

విమానంలో మళ్లీ అదే సీన్.. తోటి ప్రయాణికుడిపై మూత్ర విసర్జన
, ఆదివారం, 5 మార్చి 2023 (12:16 IST)
ఇటీవలి విమానంలో సాటి ప్రయాణికుల పట్ల కొందరు ప్రయాణికులు అనుచితంగా ప్రవర్తిస్తున్నారు. వారు చేస్తున్న చేష్టలకు ఇతర బాధిత ప్రయాణికులతో పాటు ఇతర ప్రయాణికులకు జుగుత్సాకరంగా ఉంటున్నాయి. మన దేశంలో విమానంలో ప్రయాణికులపై మూత్ర విసర్జన చేసిన ఘటనలు ఇటీవలికాలంలో వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో కూడా ఇదే తరహా ఘటన ఒకటి వెలుగు చూసింది. మద్యం మత్తులో ఓ తోటి ప్రయాణికుడిపై విద్యార్థి మూత్రవిస్తర్జన చేశాడు. దీనిపై విమాన సిబ్బంది ఫిర్యాదుతో మూత్ర విసర్జన చేసిన విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, బాధిత ప్రయాణికుడు మాత్రం పెద్ద మనసుతో విద్యార్థి భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ఫిర్యాదు చేసేందుకు నిరాకరించాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేయలేదు. 
 
శుక్రవారం రాత్రి న్యూయార్క్ నుంచి ఢిల్లీకి అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం ఒకటి బయలుదేరింది. ఇందులో ప్రయాణించిన విద్యార్థి తోటి ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేశాడు. తాగిన మైకంలో ఉన్న ఓ విద్యార్థి మూత్ర విసర్జన చేశాడు. ఈ క్రమలో అది తోటి ప్రయాణికుడిపై పడింది అని ఎయిర్‌‍పోర్టు వర్గాలు తెలిపారు. నిందితుడు అమెరికాలోని ఓ విశ్వవిద్యాలయంలో చదువుతున్నాడు. 
 
ఈ ఘటనపై విమాన సిబ్బంది ఫిర్యాదు మేరకు విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఆ విద్యార్థి క్షమాపణలు చెప్పడంతో అతడి కెరీర్ పాడవకూడదనే ఉద్దేశ్యంతో అతడిపై బాధిత ప్రయాణికుడు ఫిర్యాదు చేయలేదు. అయితే, ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన విమాన సిబ్బంది మాత్రం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు సమాచారం అందించింది. దీంతో విమానం ఢిల్లీకి చేరుకోగానే ఆ విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
'మూత్ర విసర్జన ఘటన వెలుగులోకి రాగానే ఎయిర్‌లైన్స్ భద్రతా సిబ్బంది, సీఐఎస్ఎఫ్ పోలీసులు రంగంలోకి దిగారు. విమానం ఎయిర్‌పోర్టులో దిగగానే విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు పలువురి స్టేట్‌మెంట్స్ తీసుకున్నారు' అని ఎయిర్‌పోర్టు వర్గాలు తెలిపాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వివేకా హత్య కేసు : కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి సీబీఐ మళ్లీ నోటీసులు