Webdunia - Bharat's app for daily news and videos

Install App

జో బైడెన్‌ రికార్డు.. అమెరికా చరిత్రలోనే ఎక్కువ వయస్సున్న అధ్యక్షుడిగా..?

Webdunia
శుక్రవారం, 20 నవంబరు 2020 (21:49 IST)
అమెరికా చరిత్రలోనే ఎక్కువ వయసున్న అధ్యక్షుడిగా జో బైడెన్‌ రికార్డుకెక్కనున్నారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌ తాజాగా 78 వసంతంలోకి అడుగుపెట్టారు. దీంతో ఆయన ఈ రికార్డును సొంతం చేసుకోనున్నారు. 
 
ఎన్నికల్లో మెజారిటీ సాధించిన బైడెన్‌, వచ్చే జనవరిలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇంతకుముందు, 1981-89 కాలంలో రెండు పర్యాయాలు అధ్యక్షుడిగా ఉన్న రొనాల్డ్‌ రీగన్‌కు అత్యధిక వయసు కలిగిన అధ్యక్షుడిగా రికార్డు ఉంది. 1989లో పదవీకాలం పూర్తయిన సమయం నాటికి రీగన్‌కు 77ఏళ్లు. తాజాగా రొనాల్డ్‌ రీగన్‌ రికార్డును జో బైడెన్‌ తిరగరాయనున్నారు.
 
అయితే, కరోనా ప్రభావంతో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న అమెరికాకు నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం ఒక సవాల్‌ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఓవైపు కరోనాతో ఆరోగ్య వ్యవస్థ అస్తవ్యస్థం, మరోవైపు ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న అమెరికాను గట్టెక్కించడానికి బైడెన్‌ ఎలాంటి చర్యలు తీసుకుంటారనే విషయం ప్రస్తుతం ఆసక్తిగా మారింది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments