Webdunia - Bharat's app for daily news and videos

Install App

నైజీరియాలో హైస్కూల్‌పై దుండగుల దాడి.. 140మంది విద్యార్థులు కిడ్నాప్

Webdunia
మంగళవారం, 6 జులై 2021 (11:15 IST)
నైజీరియాలో పాఠశాలలే లక్ష్యంగా విద్యార్థులపై దాడులు జరుగుతున్నాయి. తాజాగా కడునా రాష్ట్రంలోని బెతేల్ బాప్టిస్ట్ హైస్కూల్‌‌పై సోమవారం తెల్లవారుజామున దుండగులు దాడి చేశారు. అక్కడ ఉన్న 165 మంది విద్యార్థులను అపహరించారు. 
 
ఆ రాష్ట్రంలోని బెథేల్ బాప్టిస్ట్ హైస్కూల్‌‌పై సోమవారం తెల్లవారుజామున దుండగులు దాడి చేశారు. కాల్పుల‌తో భ‌యాన‌క వాతావ‌ర‌ణం సృష్టించారు. దాడి నుంచి 26 మంది చిన్నారులు, పాఠ‌శాల సిబ్బంది తృటిలో త‌ప్పించుకున్నార‌ని స్థానికులు చెబుతున్నారు. కిడ్నాప్ చేసిన చిన్నారుల‌ను ర‌హ‌స్య ప్రాంతానికి త‌ర‌లించిన‌ట్లు అక్క‌డి మీడియా తెలిపింది.
 
కాగా.. ఈ ఘ‌ట‌న‌పై బెథెల్ బాప్టిస్ట్ హైస్కూల్‌‌ టీచర్ ఇమ్మాన్యుల్ మాట్లాడుతూ.. కిడ్నాపర్లు 140 మంది విద్యార్థులను తీసుకెళ్లారు. 26 మంది విద్యార్థులు మాత్రం తప్పించుకోగలిగారు. విద్యార్థులను దుండగులు ఎక్కడికి తీసుకెళ్లారో ఇంకా స‌మాచారం లేద‌న్నారు. విద్యార్థుల‌ను కిడ్నాప్ చేశార‌నే స‌మాచారం అందుకున్న వెంట‌నే పోలీసులు అక్క‌డికి చేరుకున్నారు. ఎలా జ‌రిగింది అనే దానిపై ఆరా తీశారు. విద్యార్థుల ఆచూకీ కోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు.
 
కాగా.. క‌దునా రాష్ట్రంలో గ‌డిచిన ఆరు నెల‌ల్లో విద్యార్థుల‌ను కిడ్నాప్ చేయడం ఇది నాలుగో సారి. గ‌తేడాది డిసెంబర్ నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఇక్క‌డ వెయ్యి మంది పిల్ల‌ల‌ను సాయుధులు అప‌హ‌రించుకుపోయారు. వీరిలో 200 మంది ఇప్ప‌టికీ క‌నిపించ‌డం లేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈ పుష్ప ఎవరి దగ్గర తగ్గడు... కానీ తొలిసారి తగ్గుతున్నాడు.. పుష్ప-2 ట్రైలర్

కంగువా సిని తొలి అర్థగంట బాగాలేదు : నటి జ్యోతిక

నాగ చైతన్య - శోభితల వెడ్డింగ్ కార్డు ఎలా ఉందో తెలుసా?

'ఆత్మకథ' రాయనున్న సూపర్ స్టార్... నిజమా?

త్రివిక్రమ్ కూడా అలాగే చేస్తాడుగా, మరి మీరేమంటారు?: పూనమ్ కౌర్ ట్వీట్ వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తిరుపతిలో తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించిన ప్రముఖ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ డురియన్

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

తర్వాతి కథనం
Show comments