Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్రీస్‌లో కార్చిచ్చు.. 77మందికి పైగా మృతి.. మరో 150 మందికి తీవ్రగాయాలు

కార్చిచ్చు కారణంగా గ్రీస్‌లో 77మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరో 150 మంది తీవ్ర గాయాలపాలైయ్యారు. కార్చిచ్చు చెలరేగడానికి కారణాలేంటో తెలియరాలేదని.. ఈ నేపథ్యంలో గ్రీస్ ప్రధాని అలెక్సిస్ టిసిప్రాస్ మూ

Webdunia
బుధవారం, 25 జులై 2018 (14:07 IST)
కార్చిచ్చు కారణంగా గ్రీస్‌లో 77మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరో 150 మంది తీవ్ర గాయాలపాలైయ్యారు. కార్చిచ్చు చెలరేగడానికి కారణాలేంటో తెలియరాలేదని.. ఈ నేపథ్యంలో గ్రీస్ ప్రధాని అలెక్సిస్ టిసిప్రాస్ మూడు రోజులను సంతాప దినాలుగా ప్రకటించారు.
 
గ్రీస్‌లో సోమవారం మొదలైన దావానలం విస్తరించుకుంటూ పోతోంది. వేర్వేరు ప్రాంతాలకు పాకిన ఈ కార్చిచ్చు.. తీర ప్రాంత పట్టణమైన మాటీలో సముద్రం ఒడ్డున ఉన్న రిసార్టులో 26 మంది, ఏథెన్స్‌లో మరో 24 మందిని బలిగొన్నట్లు రెడ్ క్రాస్ అధికారులు తెలిపారు. మరికొన్ని ప్రాంతాల్లో మరో 24 మందికి పైగా మృతి చెందినట్టు సమాచారం. 
 
కార్చిచ్చును అదుపు చేసేందుకు విశ్వప్రయత్నాలు జరుగుతున్నాయని అధికారులు వెల్లడించారు. గత 2007లో సంభవించిన కార్చిచ్చులో 60 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత మళ్లీ దావానలం రేగడం ఇదే తొలిసారి అని అధికారులు తెలిపారు. కార్చిచ్చు ధాటికి భయభ్రాంతులకు గురైన సమీప ప్రాంతాల ప్రజలు గ్రామాలను ఖాళీ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments