Webdunia - Bharat's app for daily news and videos

Install App

హార్దిక్ పటేల్‌కు రెండేళ్ల జైలుశిక్ష.. రూ.50వేల జరిమానా

2015 గుజరాత్ పటీదార్ ఉద్యమం సమయంలో అల్లర్లు చోటుచేసుకున్నాయి. ఈ సందర్భంగా భారీ హింస చెలరేగింది. ఉద్యమనేత హార్దిక్‌ పటేల్‌, హింసకు ప్రేరేపించారని, ప్రభుత్వ ఆస్తులకు భారీగా నష్టం కలిగించారంటూ కేసు నమోద

Webdunia
బుధవారం, 25 జులై 2018 (13:58 IST)
2015 గుజరాత్ పటీదార్ ఉద్యమం సమయంలో అల్లర్లు చోటుచేసుకున్నాయి. ఈ సందర్భంగా భారీ హింస చెలరేగింది.  ఉద్యమనేత హార్దిక్‌ పటేల్‌, హింసకు ప్రేరేపించారని, ప్రభుత్వ ఆస్తులకు భారీగా నష్టం కలిగించారంటూ కేసు నమోదైంది. ఈ కేసులో పటేల్ కోటా ఉద్యమ నేత హార్దిక్ పటేల్‌కు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఇంకా రూ.50వేల జరిమానా కూడా విధిస్తూ స్థానిక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 
 
ఇకపోతే.. 2015లో పటేల్‌ రిజర్వేషన్ల ఉద్యమంలో మూడు వేల మంది పాల్గొన్నారు. ఈ కేసులో 17మందిపై కుట్ర, దాడి, అల్లర్ల కేసులు నమోదు అయ్యాయి. అప్పట్లోనే అరెస్ట్ అయిన హార్దిక్.. ఆ తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు. కొన్ని నెలలు మెహసానా జిల్లాలోకి ప్రవేశించకుండా కోర్టు కూడా ఆంక్షలు విధించింది. 
 
ఈ కేసులో ముగ్గురిని కోర్టు దోషులుగా తేల్చింది. హార్దిక్‌తోపాటు సర్దార్‌ పటేల్‌ వర్గం నేత లాల్జీ పటేల్‌, ఏకే పటేల్‌ను కూడా  దోషులుగా నిర్దారించింది. వీరికి కూడా రెండేళ్ల జైలు శిక్షతోపాటు రూ.50 వేల జరిమానాను కోర్టు విధించింది. మరోవైపు తీర్పువెలువడిన వెంటనే హార్దిక్‌కు చెందిన న్యాయవాది కోర్టులో బెయిల్‌ పిటీషన్‌ దాఖలు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments