Webdunia - Bharat's app for daily news and videos

Install App

22 ఏళ్ల తర్వాత కొలనులో డెడ్ బాడీ, కారు.. గుర్తించిన గూగుల్ ఎర్త్

Webdunia
శనివారం, 14 సెప్టెంబరు 2019 (15:36 IST)
గూగుల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సెర్చింజన్ అనే పేరు మోసుకుంటున్న గూగుల్.. మ్యాప్‌ ద్వారా ఏ ప్రాంతం ఎక్కడుంటే కచ్చితంగా చెప్పేస్తుంది. తాజాగా 22 ఏళ్ల త‌ర్వాత నీళ్ల‌లో వున్న మృతదేహాన్ని గూగుల్ ఎర్త్ ట్రేస్ చేసింది. వివరాల్లోకి వెళితే.. విలియం ఎర్ల్ అనే వ్యక్తి తాగిన మైకంలో ఇంటికి బయల్దేరాడు. కానీ ఇంటికి రాలేదని గర్ల్ ఫ్రెండ్ చెప్పింది. అలా తాగిన కారులో ఎక్కిన విలియమ్ చనిపోయాడని గూగుల్ ఎర్త్ కనిపెట్టింది. 
 
గూగుల్ ఎర్త్ శాటిలైట్ సెర్చ్ చేస్తుండగా 22 ఏళ్ల క్రితం అదృశ్యమైన విలియం మృతదేహం అవశేషాలు, కారు మూన్ బే సర్కిల్ కొలనులో కనిపించాయి. గూగుల్ ఎర్త్ శాటిలైట్ ఫొటో ఆధారంగా ఆ మృతదేహం విలియందేనని గుర్తించినట్టు పామ్ బీచ్ కౌంటీ షెరిఫ్ ఆఫీసు ఓ ప్రకటనలో వెల్లడించింది. చార్లీ ప్రాజెక్ట్ ఆధారంగా.. తప్పిపోయిన వ్యక్తుల గురించి సమాచారాన్ని సంకలనం చేసే డేటా బేస్‌లో విలియం అదృశ్యమైన విషయాన్ని గుర్తించాడు. 
 
మునిగిన కారు ఎవరిదో గుర్తించేందుకు పామ్ బీచ్ పోస్టు సంబంధిత అధికారులకు రిపోర్టు చేసింది. లాంటనా, వెల్లింగ్టన్ ప్రాంతానికి 20 మైళ్ల దూరంలో ఉన్న కొలను ప్రాంతాన్ని ముందుగా ఓ డ్రోన్ సాయంతో అధికారులు పరిశీలించారు. ఈ ఏడాది ఆగస్టు 28న కారుతో పాటు విలియం మృతదేహాన్ని గుర్తించారు. కానీ అతని కారు ఎలా కొలనులో మునిగింది.. అతనెలా మరణించాడనేది మాత్రం తెలియరాలేదు. ఈ ఘటన 1997 ఫ్లోరిడాలోని లాంటనా ప్రాంతంలో చోటుచేసుకుంది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments