Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పెన్సింగ్ దాటేసిన మొసలి.. ఎన్ని షేర్లు, ఎన్ని రియాక్షన్లో తెలుసా..? (Video)

Advertiesment
పెన్సింగ్ దాటేసిన మొసలి.. ఎన్ని షేర్లు, ఎన్ని రియాక్షన్లో తెలుసా..? (Video)
, బుధవారం, 21 ఆగస్టు 2019 (15:15 IST)
మొసళ్లు వరదలు ఏర్పడితే రోడ్లపై కనబడటం.. వాటిని వీడియో రూపంలో సోషల్ మీడియాలో చూస్తుండటం ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. అయితే ఇక్కడ సీన్ మారింది. ఓ మొసలి పెన్సింగ్‌ను దాటేందుకు ప్రయత్నించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

ఈ వీడియోకు లక్షల్లో వ్యూస్ వచ్చాయి. తాజాగా ఫ్లోరిడాలో రికార్డ్ చేయబడిన షాకింగ్ వీడియోలో మొసలి కంచెపైకి ఎక్కడం పెద్ద విషయం కాదు. ఆశ్చర్యకరమైన సన్నివేశం ఏంటంటే..? మొసలి కంచెపైకి ఎక్కడంపై నెటిజన్లు విభిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. 
 
ఫేస్‌బుక్ యూజర్ క్రిస్టినా స్టెవర్ట్ ఈ వీడియోతో కూడిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. నావల్ ఎయిర్ స్టేషన్ వద్ద ఈ సీన్‌ను కెమెరాలో బంధించారు. పెన్సింగ్‌పైకి మొసలి ఎక్కుతుందని చెప్తే చూడ్డానికి వెళ్లాను. దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాను. అంతే.. ఆగస్ట 17న ఈమె చేసిన పోస్టుకు 3,700కు పైగా షేర్లు, 800 కంటే ఎక్కువ రియాక్షన్లు నమోదయ్యాయి. 
 
ఇంకా ఈ సంఖ్య పెరుగుతూనే వుంది. క్రేజ్ అండ్ స్కేరీ, వాట్ కూల్ ఎక్స్‌పీరియన్స్ అంటూ కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. మొసళ్లు పెన్సింగ్‌ను ఎక్కుతాయని తెలియదంటూ చాలామంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
webdunia


ఇదే తరహాలో ఫోర్లిడాలోని రోడ్డుపైనున్న వరద నీటిలో ఓ మొసలి ఈత కొట్టుకుంటూ వెళ్లడాన్ని మరో వ్యక్తి ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ ఫోటోలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సింపతీ కోసం చంద్రబాబు సిల్లీ ఫీట్లు : అంబటి రాంబాబు సెటైర్లు