Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రెగ్నెన్సీ వచ్చిందనే విషయం తెలియదు.. కడుపునొప్పితో వెళ్లి బిడ్డతో వచ్చింది..

Webdunia
మంగళవారం, 6 సెప్టెంబరు 2022 (16:14 IST)
ప్రెగ్నెన్సీ వచ్చిందనే విషయం డెలివరీ అయ్యేవరకు కూడా తెలీదు కొందరు స్త్రీలకి. మెక్సికోలో నివసిస్తున్న 20 ఏళ్ల యువతికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఆ అమ్మాయికి ప్రెగ్నెన్సీ గురించి అస్సలు తెలియదు. ఫ్రెండ్స్‌తో కలిసి క్లబ్‌లో హాయిగా పార్టీ చేసుకుంటోంది. 
 
ఈలోగా కడుపులో విపరీతమైన నొప్పి రావడంతో డాక్టర్ దగ్గరికి వెళ్లింది. అయితే తనకు వచ్చింది మామూలు కడుపునొప్పి కాదు అది ప్రసవ వేదన అని తెలుసుకొని ఆశ్చర్యపోయింది. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.
 
వివరాల్లోకి వెళితే, మెక్సికోకు చెందిన వివియన్ వీస్ రుయిజ్వెలాస్కో(20) వృత్తిరీత్యా సేల్స్ అసిస్టెంట్‌. వివియన్‌కు గర్భానికి సంబంధించిన ఎలాంటి లక్షణాలు కనిపించలేదు, కడుపు నుంచి బయటకు రాలేదు. ఆశ్చర్యకరంగా ఆమెకు పీరియడ్స్ వస్తున్నాయి. ఆమె నిరంతరం సాధారణ వ్యాయామాలు చేస్తూనే ఉంది. ఆమె గర్భవతి అన్న సంగతి ఆమెకు తెలియదు. 
 
అక్టోబర్ 2021న స్నేహితురాలి పుట్టినరోజు వేడుక సందర్భంగా క్లబ్‌లో ఉన్న వివియన్‌కు కడుపునొప్పి మొదలైంది. అది మరింత ఎక్కువవడంతో ఇంటికి వెళ్లింది. కడుపునొప్పి తగ్గకపోవడంతో మరుసటి రోజు ఉదయం సర్జరీ ద్వారా కొడుకుకు జన్మనిచ్చింది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం