Webdunia - Bharat's app for daily news and videos

Install App

జర్మనీ చాన్స్‌లర్‌గా ఏంజిలా మెర్కెల్‌‌కే ఛాన్సెస్...

ఐరోపాలోని జర్మనీ పార్లమెంటు దిగువ సభ బుందేస్టాగ్‌కు జరిగిన ఎన్నికల్లో ప్రస్తుత చాన్స్‌లర్ ఏంజిలా మెర్కెల్ తిరిగి అధికారం చేపట్టారు. మెర్కెల్‌కు చెందిన క్రిస్టియన్ డెమొక్రెటిక్ యూనియన్(సీడీయూ)కు 33.2శా

Webdunia
సోమవారం, 25 సెప్టెంబరు 2017 (10:53 IST)
ఐరోపాలోని జర్మనీ పార్లమెంటు దిగువ సభ బుందేస్టాగ్‌కు జరిగిన ఎన్నికల్లో ప్రస్తుత చాన్స్‌లర్ ఏంజిలా మెర్కెల్ తిరిగి అధికారం చేపట్టారు. మెర్కెల్‌కు చెందిన క్రిస్టియన్ డెమొక్రెటిక్ యూనియన్(సీడీయూ)కు 33.2 శాతం ఓట్లు లభించాయి. 1949 సాధారణ ఎన్నికల తరువాత ఇంత తక్కువ శాతం ఓట్లు రావడం ఇదే తొలిసారి. 
 
ఇమ్మిగ్రేషన్‌ను వ్యతిరేకించే ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ పార్టీకి 13.1 శాతం ఓట్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో మెర్కెల్.. ప్రభుత్వం ఏర్పాటుకు మరో పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సి ఉంటుందని తెలుస్తోంది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ప్రతిపక్ష పార్టీ సోషల్ డెమొక్రటిక్‌కు 20.8 శాతం ఓట్లు వచ్చాయి. దీనిని గమనిస్తే జర్మనీలోని సగం జనాభా ఓట్లను రెండు పార్టీలే దక్కించుకున్నాయని తెలుస్తోంది.
 
కాగా, ఆదివారం నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం మెర్కెల్‌ పార్టీకి 32.5–33.5 శాతం, ఎస్‌పీడీకి 20–21 శాతం, ఏఎఫ్‌డీకి 13–13.5 శాతం ఓట్లు వచ్చాయి. 2005లో తొలిసారిగా ఏంజిలా చాన్స్‌లర్‌ పదవి చేపట్టారు. ఆమె నాయకత్వంలోని క్రిస్టియన్‌ డెమొక్రాటిక్‌ యూనియన్ ‌(సీడీయూ) – క్రిస్టియన్‌ సోషల్‌ యూనియన్‌(సీఎస్‌యూ) కూటమి 2009, 2013 ఎన్నికల్లో ఆధిక్యం సాధించడంతో పన్నెండేళ్లుగా ఏంజిలానే చాన్స్‌లర్‌ పదవిలో కొనసాగుతున్నారు. ఈసారి గెలిస్తే 16 ఏళ్లు అధికారంలో ఉండి, హెల్ముల్‌ కోల్‌ రికార్డును మెర్కెల్‌ సమం చేస్తారు. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments