Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిందువులను ఊచకోత కోసిన రోహింగ్యా ముస్లింలు...

మయన్మార్‌లో రోహింగ్యా ముస్లింల అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఓ గ్రామంలో 28 మంది హిందువుల మృతదేహాలతో ఉన్న ఓ సమాధిని మయన్మార్ ఆర్మీ కనుగొంది. మృతి చెందిన వారిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నా

Webdunia
సోమవారం, 25 సెప్టెంబరు 2017 (10:21 IST)
మయన్మార్‌లో రోహింగ్యా ముస్లింల అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఓ గ్రామంలో 28 మంది హిందువుల మృతదేహాలతో ఉన్న ఓ సమాధిని మయన్మార్ ఆర్మీ కనుగొంది. మృతి చెందిన వారిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. రోహింగ్యాలకు పట్టున్న రఖినే జిల్లాలో ఈ దారుణం జరిగింది. 
 
రోహింగ్యా ముస్లిం మిలిటెంట్లే వీరిని హత్య చేసినట్టు చెబుతున్నారు. ముస్లింల దాడితో అక్కడి వేలాదిమంది హిందువులు సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. ఆగస్టు 25న జరిగిన దాడులతో వారు తమపై కక్ష పెంచుకున్నారని, తమను లక్ష్యంగా చేసుకున్నారని హిందువులు చెబుతున్నారు. 
 
రోహింగ్యా ముస్లింలు హత్య చేసిన 28 మృతదేహాలను ఆర్మీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వారిని అత్యంత దారుణంగా, క్రూరంగా హతమార్చినట్టు ఆర్మీ చీఫ్ వెబ్‌సైట్ పేర్కొంది. అరాకన్ రోహింగ్యా సాల్వేషన్ ఆర్మీ (ఏఆర్ఎస్ఏ) గ్రూప్ వీరిని హతమార్చినట్టు తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments