Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

డేరా గుహలో కుప్పలుతెప్పలుగా పుర్రెలు, మానవ కళేబరాలు

డేరా సచ్ఛా సౌదా చీఫ్‌ గుర్మీత్‌ దుర్మార్గాలు.. తవ్విన కొద్దీ బయట వెలుగులోకి వస్తున్నాయి. బాబా ముసుగులో గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ చేసిన ఘోరాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా సిర్సాలోని డేరా ప్రధాన కా

డేరా గుహలో కుప్పలుతెప్పలుగా పుర్రెలు, మానవ కళేబరాలు
, గురువారం, 21 సెప్టెంబరు 2017 (06:58 IST)
డేరా సచ్ఛా సౌదా చీఫ్‌ గుర్మీత్‌ దుర్మార్గాలు.. తవ్విన కొద్దీ బయట వెలుగులోకి వస్తున్నాయి. బాబా ముసుగులో గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ చేసిన ఘోరాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా సిర్సాలోని డేరా ప్రధాన కార్యాలయంలో దాదాపు 600 అస్థిపంజరాలను దహనం చేసినట్లు గుర్మీత్‌ అనుచరుడు పిఆర్‌ నైన్‌ వెల్లడించాడు. గుర్మీత్‌ కేసు విచారిస్తున్న సిట్‌ బృందం విచారణకు హాజరైన గుర్మీత్‌ మద్దతుదారుడు ఈ విషయాన్ని బయటపెట్టాడు. 
 
ఇద్దరు సాధ్వీలపై లైంగికదాడి కేసులో దోషిగా తేలిన గుర్మీత్‌.. రోహ్‌తక్‌లోని సునారియా జైలులో శిక్షననుభవిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. కేసు విచారణలో భాగంగా గుర్మీత్‌ అనుచరుడు, డేరా మాజీ ఉపాధ్యక్షుడు పిఆర్‌ నైన్‌, చైర్‌పర్సన్‌ విపాసనలను సిట్‌ ప్రశ్నించింది. ఈ క్రమంలో డేరా అక్రమాలకు సంబంధించి నైన్‌ కీలక విషయాలు వెల్లడించాడు. 
 
ఎంతో మందిని చంపేసి ప్రధాన కార్యాలయంలోనే పాతిపెట్టినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో డేరా మాజీ సభ్యుడు డా. పి.ఆర్‌. నైన్‌, డేరా ఛైర్‌పర్సన్‌ విపాసనను సిట్‌ బృందం విచారించింది. జర్మనీకి చెందిన ఓ శాస్త్రవేత్త సలహా మేరకు అస్థిపంజరాలను దహనం చేసిన స్థలంలో మొక్కలు నాటారని డాక్టర్‌ నైన్‌ సిట్‌ బృందానికి తెలియజేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎన్టీఆర్‌కు భారతరత్నపై కేంద్రం స్పందన ఏమిటంటే....