Webdunia - Bharat's app for daily news and videos

Install App

అగ్రరాజ్యం అమెరికాను వణికిస్తున్న ఉల్లిగడ్డలు.. ఎందుకని?

Webdunia
శుక్రవారం, 22 అక్టోబరు 2021 (08:35 IST)
అగ్రరాజ్యం అమెరికాను మరో కొత్త వ్యాధి వణికిస్తోంది. వంటగదిలో ఉండే ఉల్లిపాయల నుంచి సాల్మొనెల్లోసిస్ అనే వ్యాధి వ్యాపిస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదైనట్లు అధికారులు గుర్తించారు. సాల్మోనెల్లా బ్యాక్టీరియా వ్యాప్తికి ఉల్లిపాయలకు మధ్య సంబంధం ఉందని సెంటర్స్ ఫర్ డెసీస్ అండ్ ప్రవెన్షన్ (సీడీసీ) తేల్చింది. 
 
అక్టోబరు 18 నాటికి 37 రాష్ట్రాల్లో 652 మందికి వ్యాపించిందని సీడీసీ డేటా తెలిపింది. ఈ వ్యాధి మరింత ప్రబలితే మహమ్మారిగా మారే నిజానికి సెప్టెంబరు నెల మధ్యలోనే ఈ సాల్మోనెల్లా కేసులు వెలుగు చూశాయి. కానీ, ఏ ఆహారం వల్ల వచ్చిందనే విషయాన్ని అధికారులు గుర్తించలేదు. 
 
ప్రధానంగా మెక్సికో, చిహువా నుంచి ప్రోసోర్స్ అనే సంస్థ…. ఉల్లిపాయలను దిగుమతి చేసుకుంది. ఈ ఉల్లిపాయలను దేశంలోని అనేక రెస్టారెంట్లు, కిరాణా షాపులకు పంపిణీ చేసింది. అమెరికాలో ప్రస్తుత వ్యాధి వ్యాప్తికి ఈ ఉల్లిపాయలే కారణమని అధికారులు ఓ స్పష్టమైన నిర్ధారణకు వచ్చారు. 
 
ఉల్లిపాయల సరఫరాదారులకు ఈ సాల్మొనెల్లా వ్యాప్తితో ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అదేసమయంలో గత మూడు నెలలపాటు నిల్వ చేసిన ఉల్లిపాయలను వాడొద్దని సీడీసీ అమెరికా వినియోగదారులను హెచ్చరించింది. ఎక్కడి నుంచి వచ్చాయో తెలియకపోయినా, మెక్సికో నుంచి వచ్చినవైనా, ఎలాంటి స్టిక్కర్ లేకపోయినా, ప్రోసోర్స్ సంస్థ నుంచి వచ్చిన ఉల్లిపాయలైనా వాటిని బయట పడేయాలని సీడీసీ సూచించింది.
 
జులై 1 నుంచి ఆగస్టు 27 వరకు దిగుమతి చేసుకున్న ఉల్లిపాయలను వెనక్కు తీసుకునేందుకు ప్రోసోర్స్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చిందని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) తెలిపింది. ఇప్పటికే అన్నీ దుకాణదారులు, ఉల్లిపాయలు వెనక్కు పంపాలని ప్రోసోర్స్ రీకాల్ నోటీసులు జారీ చేసిందని ఎఫ్‌డీఏ స్పష్టంచేసింది. 
 
కాగా, ఇప్పటికే అమెరికాలోని 37 రాష్ట్రాల్లో సాల్మొనెల్లా వ్యాపించిందని సీడీసీ గుర్తించింది. టెక్సాస్ రాష్ట్రంలో అత్యధికంగా 158 కేసులు, ఒక్లహామాలో 98, వర్జీనియాలో 59, మేరీల్యాండ్‌లో 58, ఇల్లినాయిస్‌లో 37, విస్కాసిన్‌లో 25, మిన్నెసోటాలో 23, మిస్సోరీలో 21 చొప్పున కేసులు నమోదయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments