Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బ్యాన్ చేస్తే నాకేంటి? సొంతంగా ట్రంప్ ట్రూత్‌ సోషల్ మీడియా

Advertiesment
బ్యాన్ చేస్తే నాకేంటి?  సొంతంగా ట్రంప్ ట్రూత్‌ సోషల్ మీడియా
విజ‌య‌వాడ‌ , గురువారం, 21 అక్టోబరు 2021 (14:07 IST)
మూర్ఖుడు రాజు క‌న్నా బ‌ల‌వంతుడు అంటారు... ఇపుడు అమెరికా మాజీ అధ్య‌క్షుడు డొనాల్డ్‌ ట్రంప్ వైఖ‌రి అలానే ఉంది. త‌న‌ను సోష‌ల్ మీడియా నుంచి బాయ్ కాట్ చేస్తే, త‌నే ఓ సొంత సోష‌ల్ మీడియాను ఏర్పాటు చేసుకుంటా అంటున్నారు... ట్రంప్. సామాజిక మాధ్య‌మాల్లో త‌న ఖాతాల‌ను బ్యాన్ చేస్తే, త‌నే కొత్త మాధ్య‌మాన్ని సృష్టించుకుంటాన‌ని చెపుతున్నారు. 
 
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి అనంతరం చోటు చేసుకున్న క్యాపిటల్‌ హిల్‌ హింసాత్మక ఘటనల కారణంగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై సోషల్‌ మీడియా నిషేధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.  సోషల్‌ మీడియా ప్ర‌ముఖ సంస్థ‌లైన ఫేస్ బుక్, ట్విట్ట‌ర్, యూట్యూబ్ లలో ట్రంప్‌ సోషల్‌ ఖాతాలను బ్యాన్‌ చేశారు. ఈ నేపథ్యంలో తానే స్వయంగా ఓ సోషల్‌ మీడియా నెట్‌వర్కింగ్‌ ప్లాట్‌ఫామ్‌ను తీసుకురానున్నట్లు డోనాల్డ్ ట్రంప్ ప్ర‌కటించారు. ట్రూత్‌ సోషల్‌ పేరుతో ఈ ప్లాట్‌ఫామ్‌ని తీసుకురానున్నట్లు తెలిపారు. ట్రంప్‌ మీడియా అండ్‌ టెక్నాలజీ గ్రూప్‌(టీఎంటీజీ) ఈ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. త‌న సోష‌ల్ మీడియా, త‌న సొంత ఖాతా... ఇక ట్రంప్ చేష్ఠ‌ల‌కు హ‌ద్దేముంది?

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పట్టాభిలాంటి కుక్కలతో ప్రెస్ మీట్ పెట్టించి తిట్టిస్తారా?: రోజా